యాప్నగరం

Team India: వరల్డ్ కప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్.. పంత్‌కు లక్కీ ఛాన్స్

గాయం కారణంగా శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి ఔటయ్యాడు. అతడి స్థానంలో పంత్‌ను ఆడించే అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరామని టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణియన్ తెలిపారు.

Samayam Telugu 19 Jun 2019, 6:34 pm
ఎడమ చేతి బొటన వేలికి గాయం కారణంగా శిఖర్ ధావన్ వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. టోర్నీ చివరి దశ కల్లా ధావన్ కోలుకుంటాడని మేనేజ్‌మెంట్ భావించింది. కానీ గాయం తగ్గడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. గబ్బర్ వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. ధావన్‌కు రీప్లేస్‌మెంట్‌గా పంత్‌ను ఆడించే అవకాశం కల్పించాలని బీసీసీఐని కోరామని టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రమణియన్ తెలిపారు. ఐసీసీ మెగా టోర్నీల్లో ధావన్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. దీంతో అతడి సేవలను కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని, 10-12 రోజుల తర్వాత అతడు గాయం నుంచి కోలుకుంటున్న విధానాన్ని సమీక్షిస్తామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు.
Samayam Telugu dhawan


జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 117 పరుగులతో సత్తా చాటాడు. కానీ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతడి ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. తర్వాత అది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అని తేలింది.
ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. గబ్బర్‌కు గాయమైన విషయం తెలిసిన వెంటనే పంత్‌ ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్లాడు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు అవకాశం దక్కింది.

ధావన్ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా వైదొలిగినట్టేనని బీసీసీఐ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. భారత్ శనివారం తదుపరి మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్‌తో తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.