వచ్చే సీజన్ నాటికి శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. కోల్‌కతా చాలా మంది క్రికెటర్లను రిటైన్ చేసుకోలేదన్న చోప్రా.. వచ్చే సీజన్‌కు ముందు ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్‌ను రిలీజ్ చేయాలని.. జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని సూచించాడు. శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తిలను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకోవాలని మాజీ క్రికెటర్ సూచించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేసినట్లుగానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ భవిష్యత్తు కోసం శుభ్‌మన్ గిల్‌ను తీర్చిదిద్దాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. గిల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కేకేఆర్ భావిస్తే.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు. మరో జట్టు అతణ్ని తీసుకుంటే.. కష్టం అవుతుంది. ముంబైకి రోహిత్ విజయాలను అందిస్తున్నట్లుగానే.. గిల్ సైతం కోల్‌కతాను విజయాల బాట పట్టిస్తాడని చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.
కోల్‌కతా వరుణ్ చక్రవర్తిని అట్టిపెట్టుకోవాలని.. ఒకవేళ రస్సెల్‌ను వదులుకోవాలని భావిస్తే.. తిరిగి కొనుగోలు చేయడానికి భారీ మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నాడు. కోల్‌కతా సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్‌ను రిలీజ్ చేయాలని.. ఇలా చేస్తే భారీ మొత్తంలో వారి దగ్గర డబ్బు ఉంటుందని చోప్రా తెలిపాడు.
ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్ చేయడం గొప్ప ఆలోచన అనుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వేలానికి ముందు అతణ్ని వదులుకొని.. కావాలనుకుంటే తిరిగి కొనుగోలు చేయాలని సూచించాడు.