యాప్నగరం

కప్పగెంతులు.. ఐపీఎల్‌లో ఆరోన్ ఫించ్‌ రికార్డ్

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలో దిగడం ద్వారా అత్యధిక జట్ల తరఫున ఐపీఎల్‌లో బరిలో దిగిన ఆటగాడిగా అవతరించాడు.

Samayam Telugu 13 Apr 2018, 8:41 pm
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలో దిగడం ద్వారా అత్యధిక జట్ల తరఫున ఐపీఎల్‌లో బరిలో దిగిన ఆటగాడిగా అవతరించాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి ఐపీఎల్ సీజన్ ఆడిన తర్వాతి సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణే వారియర్స్, సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. గత రెండు సీజన్లలో గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన అతడు.. ఈ సీజన్లో పంజాబ్‌కి మారాడు.
Samayam Telugu aaron-finch


మొత్తంగా ఐపీఎల్‌లో 65 ఇన్నింగ్స్ ఆడిన ఫించ్ 26.72 యావరేజ్‌తో 1603 పరుగులు చేశాడు. అందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫించ్ తర్వాత ఎక్కువ జట్లు మారిన ఆటగాళ్లెవరో చెప్పలేదు కదూ.. పార్థీవ్ పటేల్, తిసారా పెరీరా, దినేశ్ కార్తీక్ ఆరు జట్ల తరఫున ఆడారు.

ఈ ఏడాది పెరీరాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. లేకుంటే అతడు కూడా ఫించ్‌కు పోటీనిచ్చేవాడే. ఇక ఫించ్ ఆడకుండా మిగిలింది చెన్నై, కోల్‌క‌తా, బెంగళూరు ఫ్రాంచైజీలే. మరి వచ్చే మూడేళ్లలో వాటిని కూడా కవర్ చేస్తాడేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.