యాప్నగరం

SRH vs LSG మ్యాచ్‌ని మలుపు తిప్పిన అభిషేక్ ఓవర్.. 6 బంతుల్లో 31

Sunrisers Hyderabad టీమ్‌కి ఒకే ఒక ఓవర్ మ్యాచ్‌ని పూర్తిగా దూరం చేసింది. హిట్టర్లు క్రీజులో ఉన్నప్పుడు పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మతో హైదరాబాద్ కెప్టెన్ మర్‌క్రమ్ బౌలింగ్ చేయించాడు. అదే పెద్ద తప్పిదమైంది. ఆ ఓవర్ ముగిసే సమయానికి లక్నో చేతుల్లోకి మ్యాచ్ వెళ్లిపోయింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 13 May 2023, 8:57 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ ఓటమికి కారణమైన అభిషేక్ శర్మ
  • ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు.. అదనంగా ఓ వైడ్ కూడా
  • సులువుగా మ్యాచ్‌లో గెలిచేసిన లక్నో టీమ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu SRH vs LSG
నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకి సొంతగడ్డపై చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 182 పరుగులు చేసినా.. స్పిన్నర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) వేసిన ఒక ఓవర్ దెబ్బకి మ్యాచ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకోవాల్సి వచ్చింది. చివరికి లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో లక్నో టీమ్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది.
ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చివరి 30 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ని పార్ట్ టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మతో హైదరాబాద్ కెప్టెన్ మర్‌క్రమ్ వేయించాడు. కానీ అదే అతని తప్పిదమైంది. ఆ ఓవర్‌లో ఫస్ట్ బాల్‌కి స్టాయినిస్‌కి సిక్స్ సమర్పించుకున్న అభిషేక్.. రెండో బంతిని వైడ్‌గా వేసి ఆ తర్వాత బంతికి మళ్లీ సిక్స్ ఇచ్చేశాడు. అయితే మూడో బంతికి మాత్రం స్టాయినిస్‌ని ఔట్ చేయగలిగాడు. కానీ.. అప్పుడే క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ చివరి మూడు బంతుల్నీ వరుసగా 6,6,6గా మలిచేశాడు. దెబ్బకి లక్నో టీమ్ గెలుపు సమీకరణం 24 బంతుల్లో 38 పరుగులతో తేలికగా మారిపోయింది.

ఇన్నింగ్స్ 16వ ఓవర్ తర్వాత హైదరాబాద్ టీమ్ పుంజుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లాస్ట్ వరకూ క్రీజులో నిలిచిన నికోలస్ పూరన్ (44 నాటౌట్: 13 బంతుల్లో 3x4, 4x6),ప్రీరాక్ మాన్కడ్ (64 నాటౌట్: 45 బంతుల్లో 7x4, 2x6) పోటీపడి బౌండరీలు బాదేసి లక్నో టీమ్‌కి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ద్వారా ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు హైదరాబాద్ టీమ్ నిష్క్రమించినట్లైంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.