యాప్నగరం

IPL 2021 సీజన్‌కి ఇంగ్లాండ్ ఆటగాళ్లు డౌట్.. ఎండీ ఆశ్లే క్లారిటీ

ఐపీఎల్‌లోని చాలా జట్లలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆడుతున్నారు. కొన్ని జట్లలో ఈ ఇంగ్లాండ్ ఆటగాళ్లే పెద్ద బలంగా కనిపిస్తున్నారు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకి..?

Samayam Telugu 11 May 2021, 11:00 am

ప్రధానాంశాలు:

  • ఐపీఎల్ 2021 సీజన్‌ని వాయిదా వేసిన బీసీసీఐ
  • సెప్టెంబరు- అక్టోబరులో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్
  • ఇంగ్లాండ్ ఆటగాళ్లని పంపబోమని స్పష్టీకరణ
  • రాజస్థాన్ టీమ్‌పై ఎక్కువ ప్రభావం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jos Buttler, Ben Stokes (Pic Credit: Twitter)
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆడబోరని ఆ జట్టు ఇంటర్నేషనల్ షెడ్యూల్ మెనేజింగ్ డైరెక్టర్ ఆశ్లే గిల్స్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌‌లో షెడ్యూల్ ప్రకారం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. జట్లలో కరోనా కేసులు నమోదవడంతో.. 29 మ్యాచ్‌లు ముగియగానే టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వాయిదా వేసింది. ఇక మిగిలిన మ్యాచ్‌లని సెప్టెంబరు- అక్టోబరులో యూఏఈ వేదికగా నిర్వహించే ఆలోచనల్లో బీసీసీఐ ఉంది. కానీ.. మిగిలిన సీజన్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లని అనుమతించబోమని ఆశ్లే స్పష్టం చేశాడు.
ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ అక్టోబరు- నవంబరులో జరగనుండగా.. అంతకముందు ఇంగ్లాండ్ టీమ్ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో ఇంటర్నేషనల్ సిరీస్‌ల్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఇంగ్లాండ్ టీమ్‌కి ఆడే క్రికెటర్లని ఐపీఎల్ కోసం రిలీజ్ చేయబోమని ఆశ్లే చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే ఐపీఎల్‌లో ఆడుతుండగా.. పాకిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్‌కి దూరమై ఏళ్లు గడుస్తోంది. ఇక ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..? బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, శామ్ కరన్, జానీ బెయిర్ స్టో, ఇయాన్ మోర్గాన్, క్రిస్ జోర్దాన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్ తదితరులు ఉన్నారు.

‘‘ఇంగ్లాండ్ టీమ్ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లు ఆడితే..? ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆడతారని నేను అనుకోవడం లేదు. ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. తమ దేశ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టీమ్‌కి ఆడటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది’’ అని ఆశ్లే స్పష్టం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.