యాప్నగరం

IPL 2020 సీజన్ ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు మరో వారంలో ముగియనుండటంతో ప్లేఆఫ్, ఫైనల్ షెడ్యూల్‌ని తాజాగా బీసీసీఐ విడుదల చేసింది. ఫైనల్ మ్యాచ్‌ తొలిసారి వీకెండ్‌లో కాకుండా..?

Samayam Telugu 26 Oct 2020, 8:13 am
ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. నవంబరు 3 వరకూ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా.. ఒక్క రోజు గ్యాప్‌తో నవంబరు 5 నుంచి ప్లేఆఫ్ మ్యా‌చ్‌లు జరగనున్నాయి. ఫైనల్ తేదీని గతంలోనే షెడ్యూల్‌లో ప్రకటించిన బీసీసీఐ.. ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరిగే వేదికలపై మాత్రం ఓ క్లారిటీకి రాలేకపోయింది. అయితే.. తాజాగా లీగ్ దశ మ్యాచ్‌లు మరో వారం ముగియనుండటంతో ప్లేఆఫ్, ఫైనల్ జరిగే వేదికల్ని ప్రకటించింది.
Samayam Telugu IPL 2020 (Photo Credit: BCCI/IPL)


నవంబరు 5న దుబాయ్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుండగా.. నవంబరు 6న అబుదాబిలో ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు గ్యాప్‌లో నవంబరు 8న క్వాలిఫయర్-2 మళ్లీ అబుదాబిలోనే జరగనుంది. ఇక ఆఖరిగా నవంబరు 10న దుబాయ్ వేదికగా ఫైనల్‌ని నిర్వహించనున్నారు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్ వీకెండ్‌లో కాకుండా వీక్ మధ్యలో(మంగళవారం) జరగడం ఇదే తొలిసారి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకి ప్రారంభంకానున్నాయి.

లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4 నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. తొలుత పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో తలపడనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుంది. ఇక పట్టికలో 3,4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో ఆడనుండగా.. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికి వెళ్లనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు... క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి వెళ్లనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్టు ఒకవేళ క్వాలిఫయర్-1లో ఓడినా క్వాలిఫయర్-2లో ఆడటం ద్వారా ఫైనల్‌కి చేరే మరో అవకాశం ఇస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.