ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్స్ (IPL 2023 Playoffs) మ్యాచ్‌ల షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెపాక్‌లో 30వ మ్యాచ్ జరుగుతోంది. సీజన్ లీగ్ దశలో 10 జట్లు కలిపి మొత్తం 70 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ లీగ్ దశ మ్యాచ్‌లు మే 21న ముగియనున్నాయి. ఆ తర్వాత ఒక్క రోజు గ్యాప్‌తో అంటే..? మే 23 నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మే 23న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుంది. ఓడిన టీమ్‌కి క్వాలిఫయర్ -2లో ఆడటం ద్వారా ఫైనల్‌కి చేరేందుకు మరో ఛాన్స్ దక్కనుంది. ఇక పట్టికలో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మే 24న చెపాక్‌లోనే ఎలిమినేటర్ జరగనుంది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. అలానే గెలిచిన టీమ్ క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టుతో మే 26న అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కి.. ఓడిన టీమ్ ఇంటికి వెళ్లనుంది. ఆఖరిగా మే 28న క్వాలిఫయర్-1 మ్యాచ్ విజేత, క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేత మధ్య ఫైనల్ పోరు అహ్మదాబాద్‌లో జరగనుంది.