యాప్నగరం

ఐపీఎల్‌పై బిసిసిఐ చీఫ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ ఎడిషన్ ఈనెల 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా వచ్చే నెల 15 కు వాయిదా వేశారు. తాజాగా ఐపీఎల్‌పై గంగూలీ స్పందించాడు.

Samayam Telugu 24 Mar 2020, 9:30 pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ఎడిషన్ ప్రారంభించడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ టోర్నీ ఈనెల 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా వచ్చే నెల 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాము వాయిదా వేసిన అప్పటినుంచి గత పది రోజులుగా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని గంగూలీ గుర్తుచేశాడు. దీనిపై తాము వేచి చూసే ధోరణి అవలంబిస్తామ‌ని గంగూలీ పేర్కొన్నాడు.
Samayam Telugu Kolkata: BCCI President Sourav Ganguly addresses during the inauguration of 25th...
BCCI President Sourav Ganguly


Read Also: టీ20ల్లో ఇండియన్ ప్లేయర్ల ఈ రికార్డులు ఎప్పటికీ పదిలమేనా..?

ఐపీఎల్ ప్రారంభించడం పై తన వద్ద సమాధానం లేదని, గత ప‌ది రోజులుగా ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు. బోర్డు తరఫున ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ) ముందే నిర్ణయించబడిందని, ఇప్పుడు దానిలో మార్పులు చేసే అవకాశం లేదని గుర్తు చేశాడు. వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్, ఇతర క్రీడలకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ వాయిదా పడ్డాయని పేర్కొన్నాడు.

Read Also: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ వాయిదా!

ఇక ఐపీఎల్ గురించి బోర్డు కార్యదర్శి జై షా ఎలాంటి చర్చలు జరప‌లేదని దాదా పేర్కొన్నాడు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామ‌ని తెలిపిన గంగూలీ.. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తామని పేర్కొన్నాడు. ఇక వైరస్ కూడా భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య ఇప్పటికే ఐదు వందలు దాటి పోగా.. పది మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.