యాప్నగరం

ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ధోనీపై గౌరవాన్ని చాటుకున్న బీసీసీఐ

Team India ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్న వేళ.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ధోనీపై గౌరవాన్ని చాటుకుంది.

Samayam Telugu 28 Oct 2020, 3:37 pm
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా ఎంఎస్ ధోనీ గుర్తింపు పొందాడు. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ లేకుండా తొలిసారి భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ 32 మందితో కూడిన జంబో జట్టును ఎంపిక చేసింది.
Samayam Telugu Dhoni


భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా.. బీసీసీఐ మహేంద్రుడిని ప్రశంసించింది. థ్యాంక్యూ ఎంఎస్ ధోనీ అనే హ్యాష్ ట్యాగ్‌, మహీ ఫొటోతో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ కవర్ ఫొటోలను మార్చేసింది.

Image: Twitter/BCCI

ధోనీ సేవలకు గుర్తుగా బీసీసీఐ ఇలా గౌరవం ఇవ్వడం పట్ల మహేంద్రుడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బీసీసీఐపై ప్రశంసలు గుప్పిస్తూ... ట్వీట్లు చేస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ చాలా కాలంగా క్రికెట్ ఆడకపోవడంతో.. టచ్‌లోకి రావడానికి మహీ ఇబ్బంది పడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండమే కాకుండా.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.