యాప్నగరం

ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలం ఎప్పుడంటే..?

ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు ఏప్రిల్- మే నెలలో జరిగే సూచనలు కనిపిస్తుండగా.. ఇప్పటికే టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు రిటైన్, వేలంలోకి విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి.

Samayam Telugu 23 Jan 2021, 1:11 pm
ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేస్తోంది. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు ఇప్పటికే అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టిన క్రికెటర్ల జాబితాని ప్రకటించగా.. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్- మే నెలలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో.. ఫిబ్రవరిలోనే వేలం నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన బీసీసీఐ.. 18వ తేదీని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. వేలం నిర్వహించే వేదికపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
Samayam Telugu IPL 2021 Auction (Image Credit: IPL/BCCI)


వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌‌‌లో మరో రెండు జట్లు.. అంటే మొత్తం 10 జట్లు ఆడబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ.. గత ఏడాది డిసెంబరు 24న జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో.. జట్ల పెంపుపై చర్చ జరగగా.. సమయం తక్కువగా ఉండటంతో రెండు జట్ల చేరిక, ఆ తర్వాత మెగా వేలం నిర్వహించడం సాధ్యం కాదని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. దాంతో.. ఆ ప్రతిపాదనని పక్కక పెట్టిన బీసీసీఐ.. ఐపీఎల్ 2020 సీజన్‌ని 8 జట్లతోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

టోర్నీలోని కొన్ని ఫ్రాంఛైజీలు వేలం ముంగిట ట్రేడ్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ రాబిన్ ఉతప్పని (రూ.3కోట్లు)ని చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. సంజు శాంసన్ ట్రేడ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై ఫ్రాంఛైజీలు ప్రయత్నించాయి. కానీ.. రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోలేదు సరికదా.. ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్‌ని యూఏఈ వేదికగా నిర్వహించిన బీసీసీఐ.. ఐపీఎల్ 2021 సీజన్‌ మాత్రం భారత్ వేదికగానే జరుగుతుందని ఇప్పటికే ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.