యాప్నగరం

Suresh Raina పేరును తొలగించిన చెన్నై సూపర్ కింగ్స్

IPL 2020 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన సురేశ్ రైనా పేరును చెన్నై సూపర్ కింగ్స్ తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. హర్భజన్ పేరును సైతం తీసేసింది.

Samayam Telugu 29 Sep 2020, 8:04 am
ఐపీఎల్ 2020 నుంచి బయటకు వచ్చేసిన సురేశ్ రైనా.. క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఐపీఎల్‌కు దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. యూఏఈ వెళ్లిన తర్వాత రైనా ఈ నిర్ణయం తీసుకొని భారత్ తిరిగి రావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో రైనా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయమై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. తాము రైనాను పిలవబోమని ఇదివరకే స్పష్టం చేశారు.
Samayam Telugu Suresh Raina


తాజాగా సురేశ్ రైనా పేరును చెన్నై సూపర్ కింగ్స్ తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో ఈ సీజన్లో రైనా జట్టులోకి తిరిగి రావడం ఇక కుదరదని చెన్నై జట్టు నిర్ధారించినట్లయ్యింది. రైనా పేరుతోపాటు హర్భజన్ సింగ్ పేరును కూడా అఫీషియల్ వెబ్‌సైట్లో నుంచి తొలగించారు.

జట్టులో రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా ఆడే డుప్లెసిస్.. రైనా లేకపోవడంతో మూడో స్థానంలో బరిలో దిగాల్సి వస్తోంది. మురళీ విజయ్, షేన్ వాట్సన్ ఫామ్ కోసం తంటాలు పడుతున్నారు. అంబటి రాయుడు గాయం కారణంగా రెండు, మూడో మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు ధోనీ కూడా ఆశించినట్లుగా ఆడటం లేదు. రైనా, హర్భజన్ లాంటి సీనియర్లు దూరమైన ప్రభావం చెన్నై మీద బాగానే పడింది. వీరిద్దరూ లీగ్‌కు దూరమైన చెన్నై ఎవర్నీ రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించలేదు. అక్టోబర్ 2న చెన్నై, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.