యాప్నగరం

MI vs CSK: ఒకే ఓవర్లో రెండు స్టన్నింగ్ క్యాచ్‌లు.. అదరగొట్టిన డుప్లెసిస్.. ట్విట్టర్లో ప్రశంసల వర్షం

Chennai Super Kings ఫీల్డర్ డుప్లెసిస్ ఒకే ఓవర్లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అందుకొని ఔరా అనిపించాడు. ప్రమాదకర తివారీ, హార్దిక్ పాండ్యను పెవిలియన్ చేర్చాడు.

Samayam Telugu 19 Sep 2020, 10:03 pm
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్ అద్భుతం చేశాడు. ఐదు బంతుల వ్యవధిలో రెండు అద్భుత క్యాచ్‌లను అందుకొని కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చాడు. 14 ఓవర్లలో 121/3తో ముంబై నిలవగా.. 42 పరుగులతో సౌరభ్ తివారీ ప్రమాదకరంగా మారాడు. ఈ దశలో 15వ ఓవర్ వేసిన జడేజా రెండు వికెట్లు తీశాడు.
Samayam Telugu Image: screengrab hotstar


14.1వ ఓవర్లో.. తివారీ భారీ షాట్‌కు యత్నించాడు. దాదాపుగా సిక్స్ అనుకున్న సమయంలో.. బౌండరీ లైన్ దగ్గరున్న డుప్లెసిస్ అమాంతం గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోతానని గ్రహించి.. వెంటనే బంతిని గ్రౌండ్ లోపలికి విసిరాడు. తర్వాత బౌండరీ లైన్ అవతల పాదం పెట్టి వెంటనే బ్యాలెన్స్ చేసుకొని.. లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్నాడు.

తర్వాత అదే ఓవర్లో.. ఐదో బంతికి హార్దిక్ పాండ్య బంతిని బలంగా బాదాడు. సిక్స్ అనుకుంటున్న దశలో.. ఓ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి పాండ్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు కష్టమైన క్యాచ్‌లను అందుకొని జడేజాకు వికెట్లను గిఫ్ట్‌గా ఇవ్వడంతో.. ముంబై 162/9కే పరిమితం అవడంలో కీలక పాత్ర పోషించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.