యాప్నగరం

భారత జట్టులో సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌.. వార్నర్ సందేశం

Sunrisers Hyderabad యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్‌కు అదృష్టం కలిసొచ్చింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో.. అతడి స్థానంలో నటరాజన్‌కు ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో చోటు దక్కింది.

Samayam Telugu 10 Nov 2020, 8:29 am
యార్కర్ల స్పెషలిస్ట్ నటరాజన్‌కు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కంగ్రాట్స్ చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన భారత టీ20 జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తికి రీప్లేస్‌మెంట్‌గా నటరాజన్‌ను ప్రకటించారు. వరుణ్ చక్రవర్తి భుజానికి గాయం కావడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కంగ్రాచ్యులేషన్స్ నట్టూ.. ఆస్ట్రేలియాలో కలుద్దాం’’ అని తన జట్టు సభ్యుణ్ని అభినందిస్తూ వార్నర్ మాట్లాడిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ షేర్ చేసింది.
Samayam Telugu T Natarajan
T Natarajan. (BCCI/IPL Photo)


ఈ సీజన్లో బరిలో సన్‌రైజర్స్ తరఫున 16 మ్యాచ్‌ల్లో బరిలో దిగిన నటరాజన్... 31.50 యావరేజ్, 8.02 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్‌ను ఔట్ చేయడం కోసం అతడు సంధించిన యార్కర్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

తొలిసారి భారత జట్టుకు ఎంపికైన నటరాజన్‌ను మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభినందించాడు. ‘కష్టపడి పని చేయడం, ఎప్పటికీ ఆశలను వదులుకోకపోవడమే నటరాజన్‌ స్టోరీ. తొలిసారి టీమిండియాకు ఎంపికైనందుకు కంగ్రాట్స్ బడ్డీ’ అని పఠాన్ ట్వీట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.