యాప్నగరం

Rishabh Pant ఐడియా అదిరింది.. ధోనీలా వికెట్ కోసం ప్లాన్

ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకి అనుగుణంగా స్పిన్నర్లకి వికెట్ల వెనుక నుంచి ధోనీ సూచనలు చేస్తుంటాడు. తాజాగా అదే బాటలో రిషబ్ పంత్ కూడా పయనిస్తూ ఫలితాలు రాబడుతున్నాడు.

Samayam Telugu 30 Apr 2021, 8:08 am

ప్రధానాంశాలు:

  • అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్వీప్ ఆడబోయిన దినేశ్ కార్తీక్
  • వికెట్ల వెనుక నుంచి ఓ సూచన చేసిన రిషబ్ పంత్
  • నెక్ట్స్ బాల్‌కే దినేశ్ కార్తీక్ ఎల్బీడబ్ల్యూ‌గా ఔట్
  • మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఢిల్లీ గెలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rishabh Pant (Pic Credit: IPLT20.com video grab)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ల వెనుక కాసేపు మహేంద్రసింగ్ ధోనీని తలపించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. ఓపెనర్ నితీశ్ రాణాని చాకచక్యంగా స్టంపౌట్ చేసిన రిషబ్ పంత్.. దినేశ్ కార్తీక్ వికెట్ కోసం స్పిన్నర్ అక్షర్ పటేల్‌తో కలిసి ప్లాన్ చేశాడు. వికెట్ల వెనుక నుంచి హిందీలో అక్షర్‌కి రిషబ్ పంత్ సూచనలు చేయడం స్టంప్ మైక్‌లో రికార్డైంది.
స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తూ కనిపించాడు. దాంతో.. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో అక్షర్ పటేల్‌‌‌కి వికెట్ల వెనుక నుంచి రిషబ్ హిందీలో ఓ సూచన చేశాడు. దినేశ్ కార్తీక్ హిట్టింగ్ జోన్‌కి దూరంగా బంతి విసరాలని సూచించాడు. దాంతో.. ఆఫ్ స్టంప్‌ లైన్‌కి వెలుపలగా బంతి విసిరిన అక్షర్ పటేల్.. కొద్దిగా టర్న్ చేశాడు. పంత్ సూచనలు విన్న దినేశ్ కార్తీక్ మళ్లీ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్‌కి తాకకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని తాకింది. దాంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం రిషబ్ పంత్ అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు.


అక్షర్ పటేల్ విసిరిన బంతి వికెట్లకి దూరంగా వెళ్తోందని భ్రమపడిన దినేశ్ కార్తీక్.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ఆండ్రీ రసెల్‌తో ఒకసారి కన్ఫార్మ్ చేసుకుని డీఆర్‌ఎస్ కోరాడు. కానీ.. రిప్లైలో బంతిని నేరుగా వెళ్లి మిడిల్ స్టంప్‌ని తాకేలా కనిపించడంతో.. దినేశ్ కార్తీక్‌‌కి నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా.. ఛేదనలో పృథ్వీ షా (82: 41 బంతుల్లో 11x4, 3x6) దూకుడుగా ఆడటంతో ఢిల్లీ 16.3 ఓవర్లలోనే 156/3తో విజయాన్ని అందుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.