యాప్నగరం

IPLలో పంత్ కోసం స్టేడియంలో ఢిల్లీ ప్రత్యేక ఏర్పాట్లు.. డగౌట్ వరకు ర్యాంప్!

Rishabh Pant IPL 2023కి దూరమవడం లాంఛనమే. గత ఏడాది యాక్సిడెంట్‌తో తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కానీ ఇప్పట్లో అతను మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ డగౌట్‌లో అతను కనిపించే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు డీడీసీఏ ముందుకు వచ్చింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 30 Mar 2023, 8:31 pm

ప్రధానాంశాలు:

  • రిషబ్ పంత్‌కి గత ఏడాది చివర్లో యాక్సిడెంట్
  • మార్చి 31 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు
  • మరో 5-6 నెలలు ఆటకి దూరంగా పంత్
  • కానీ.. ఐపీఎల్‌లో ఢిల్లీ డగౌట్‌లో కనిపించబోతున్న పంత్?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rishabh Pant, Delhi, IPL 2023
రిషబ్ పంత్
ఐపీఎల్ 2023 (IPL 2023)కి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమైన విషయం తెలిసిందే. గత ఏడాది చివర్లో ఢిల్లీ - డెహ్రాడూన్ హైవేపై రిషబ్ పంత్‌ (Rishabh Pant) ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ సర్జరీలు చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే కనీసం ఓ 5-6 నెలలు సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు.
రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని కెప్టెన్‌గా ఐపీఎల్ 2023లో డేవిడ్ వార్నర్ నడిపించబోతున్నాడు. కానీ.. పంత్ స్థానంలో ప్లేయర్‌ని మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఎవరినీ తీసుకోలేదు. మార్చి 31 (శుక్రవారం) నుంచి ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే.. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే? ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ ఏడాది ఏడు మ్యాచ్‌లను ఆడనుంది. ఆ మ్యాచ్‌ల్ని వీక్షించేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి రాబోతున్నాడు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రిషబ్ పంత్ మ్యాచ్‌లు ఆడకపోయినా.. ఢిల్లీ టీమ్ డగౌట్‌లో కూర్చున్నా చాలని ఆ జట్టు కోచ్ రిక్కీ పాంటింగ్ ఇటీవల చెప్పుకొచ్చాడు. దాంతో డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘‘అరుణ్ జైట్లీ స్టేడియంలోకి వచ్చేందుకు రిషబ్ పంత్ ఓకే అంటే.. మేము అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం. అతడ్ని ఇంటి దగ్గర పికప్ చేసుకోవడం నుంచి తిరిగి మళ్లీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే వరకూ బాధ్యతలు తీసుకుంటాం. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అనుమతిస్తే? రిషబ్ పంత్ ఆ టీమ్ డగౌట్‌కి చేరుకునేలా స్పెషల్ ర్యాంప్‌ని ఏర్పాటు చేస్తాం’’ అని వెల్లడించాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.