రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఓ చెత్త రికార్డ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరసన చేరాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్.. కనీసం పరుగుల ఖాతా కూడా తెరవకుండానే ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటైపోయాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. దినేశ్ కార్తీక్ డకౌటవడం ఇది 16వసారి. 16 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇలా 16 సార్లు జీరోకి ఔటైన ప్లేయర్లు రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మాత్రమే. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ (16), దినేశ్ కార్తీక్ (16) టాప్-2లో ఉండగా ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌కి ఆడుతున్న ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, బ్యాటర్ మన్దీప్ సింగ్ 15 సార్లు డకౌట్స్‌తో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో దినేశ్ కార్తీక్ మరీ ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటికే 12 మ్యాచ్‌లాడిన కార్తీక్ చేసిన పరుగులు కేవలం 140 మాత్రమే. తాజా సీజన్లో అతని బ్యాటింగ్ సగటు 12.72కాగా.. అత్యధిక స్కోరు 30 పరుగులు. బ్యాటింగ్‌లో వైఫల్యం క్రమంగా అతని కీపింగ్‌పై కూడా ప్రభావం చూపుతోంది.
రాజస్థాన్‌తో మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ స్థానంలో అనుజ్ రావత్ వికెట్ కీపింగ్ చేశాడు. వికెట్ల వెనుక చాలా చురుగ్గా కనిపించిన అనుజ్ రావత్.. మహేంద్రసింగ్ ధోనీ తరహాలో అశ్విన్‌ని నో లుక్ రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలానే బ్యాటింగ్‌లోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడు. దాంతో దినేశ్ కార్తీక్‌పై నెక్ట్స్ మ్యాచ్‌లో వేటు పడే అవకాశం ఉంది.