యాప్నగరం

తండ్రికి బ్రెయిన్ క్యాన్సర్.. ఐపీఎల్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!?

IPL 2020కి కీలక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పూర్తిగా దూరం కావొచ్చని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. తండ్రి అనారోగ్యం కారణంగా స్టోక్స్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్నాడు.

Samayam Telugu 26 Sep 2020, 12:00 pm
రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాళ్లలో ఒకడైన బెన్ స్టోక్స్.. తొలి మ్యాచ్‌లో ఆడని సంగతి తెలిసిందే. 2018 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతణ్ని రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌పై రాజస్థాన్ జట్టు అతిగా ఆధారపడుతోంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు దూరమైన అతడు అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరతాడని వార్తలొచ్చాయి.
Samayam Telugu ipl


కానీ ఐపీఎల్ 13వ సీజన్‌కు బెన్‌స్టోక్స్ దూరమయ్యే అవకాశ ఉందని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ తెలిపాడు. స్టోక్స్ తండ్రికి బ్రెయిన్‌ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో న్యూజిలాండ్‌లో ఉన్న తన కుటుంబానికి సపోర్ట్‌గా ఉండటం కోసం స్టోక్స్ ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్ వెళ్లాడు.

Ben Stokes.Photo)


‘‘బెన్ స్టోక్స్ తండ్రి ఆరోగ్యం బాగోలేదు. ఈ కారణంతో అతడు న్యూజిలాండ్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అతడు ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లేది అనుమానమే’’ అని పనేసర్ తెలిపాడు. స్టోక్స్‌ను సూపర్ మ్యాన్ ఆఫ్ క్రికెట్‌తో పోల్చిన పనేసర్.. ఐపీఎల్‌లో అతడు ఆడితే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నాడు.

చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ 216 రన్స్ చేయగా.. బదులుగా చెన్నై 200 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో స్మిత్, శాంసన్ హాఫ్ సెంచరీలు బాదగా.. ఆఖర్లో ఆర్చర్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.