యాప్నగరం

టీమిండియా ఫ్యాన్స్‌కి జస్‌ప్రీత్ బుమ్రా గుడ్‌న్యూస్.. రీఎంట్రీపై సంకేతం

Jasprit Bumrah రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గత 10 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన ఈ ఫాస్ట్ బౌలర్ బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఇటీవల వెన్ను గాయానికి అతను సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 27 May 2023, 10:02 pm

ప్రధానాంశాలు:

  • రీఎంట్రీపై సంకేతాలు ఇచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా
  • వెన్ను గాయంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి ఆటకి దూరం
  • ఇటీవల న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్న బుమ్రా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jasprit Bumrah
జస్‌ప్రీత్ బుమ్రా
భారత క్రికెట్ అభిమానులకి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) గుడ్‌న్యూస్ చెప్పాడు. వెన్ను గాయం కారణంగా గత 10 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌కి వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా బౌలింగ్ స్పైక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బుమ్రా.. ‘హలో ఫ్రెండ్.. మళ్లీ మనం కలుస్తున్నాం’ అని రాసుకొచ్చాడు.
గత ఏడాది సెప్టెంబరులో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌ ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఆ తర్వాత వెన్ను గాయంతో టీమ్‌కి దూరంగా ఉండిపోయాడు. దాంతో ఆసియా కప్ -2022తో పాటు టీ20 వరల్డ్‌కప్ -2022కి కూడా బుమ్రా దూరమయ్యాడు. అయితే.. ఈ ఏడాది జనవరిలో అతను రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీలంకతో సిరీస్‌ కోసం టీమ్‌లోకి కూడా ఎంపికయ్యాడు. కానీ సిరీస్‌ ఆరంభానికి ముందే మళ్లీ పాత వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుల సూచనల మేరకు న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్నాడు.

సర్జరీ కారణంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2023కి కూడా జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అలానే జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కూడా బుమ్రా ఎంపికవలేదు. కానీ ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ -2023 జరగనుంది. దాంతో ఈ టోర్నీ టైమ్‌కి బుమ్రా రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1)
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.