యాప్నగరం

కోల్‌కతాకు షాక్.. ఐపీఎల్‌కు యువపేసర్ దూరం

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌కు దూరం కాగా.. అండర్-19 పేస్ బౌలింగ్ సంచలనం కమలేష్ నాగర్‌కోటి కూడా ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

Samayam Telugu 14 Apr 2018, 3:55 pm
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అండర్-19 పేస్ బౌలింగ్ సంచలనం కమలేష్ నాగర్‌కోటి గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన కమలేష్‌ను కోల్‌కతా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే కమలేష్‌కు గాయమైనప్పటికీ.. పది రోజుల్లోగా కోలుకుంటాడని నైట్ రైడర్స్ భావించింది.
Samayam Telugu Kamlesh Nagarkoti vs Australia


కానీ పాదానికైన గాయం తీవ్రమైంది కావడంతో.. నాగర్‌కోటి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కర్ణాటక బౌలర్ ప్రసీద్ కృష్ణను కోల్‌క‌తా జట్టులోకి తీసుకుంది. ప్రసీద్ కర్ణాటక తరఫున 2015లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కుడిచేతి వాటం పేసర్ అయిన కృష్ణ 19 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టారు.

ఇప్పటికే గాయం కారణంగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కో‌ల్‌కతాకు దూరమయ్యాడు. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో మిచెల్ జాన్సన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగలేదు. వినయ్ కుమార్ చివరి ఓవర్లో 17 పరుగులివ్వడంతో సీఎస్‌కే చేతిలో కోల్‌కతా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.