యాప్నగరం

SRH vs KXIP: పిచ్ మధ్యలోకి వచ్చి ఆగిపోయిన బెస్ట్ ఫ్రెండ్స్.. ఫన్నీ రనౌట్

కొన్నేళ్ల నుంచి రాహుల్, మయాంక్ కలిసి ఆడుతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ ఈ జోడీ ప్రత్యర్థి బౌలర్లని ఉతికారేస్తోంది. కానీ.. ఎక్కడా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్.. తత్తరపాటు కనిపించలేదు. అయితే..?

Samayam Telugu 9 Oct 2020, 10:16 am
ఐపీఎల్ 2020 సీజన్‌‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయంక్ అగర్వాల్ మధ్య తొలిసారి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సుదీర్ఘకాలం కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడిన ఈ జంట.. టీమిండియాకి కూడా కలిసి ఆడింది. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా తమకి తాము బెస్ట్ ఫ్రెండ్స్‌గా చెప్పుకునే ఈ జోడీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తత్తరపాటుకి గురైంది. దాంతో.. మయాంక్ అగర్వాల్ తన వికెట్‌ని త్యాగం చేయాల్సి వచ్చింది.
Samayam Telugu Mayank Agarwal Run Out (Screengrab:IPL/Video)


202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆచితూచి ఆడేలా కనిపించిన కేఎల్ రాహుల్ (11: 16 బంతుల్లో), మయాంక్ అగర్వాల్ (9: 6 బంతుల్లో) జోడీ.. రెండో ఓవర్‌లో తొందరపడింది. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని కవర్స్ దిశగా నెట్టిన మయాంక్ అగర్వాల్ సింగిల్ పూర్తి చేయగా.. రెండో పరుగు కోసం కేఎల్ రాహుల్ పిలిచాడు. దాంతో స్పందించిన మయాంక్.. దాదాపు పిచ్ సగంలోకి వెళ్లిపోగా.. సడన్‌గా కేఎల్ రాహుల్ ఆగిపోయాడు. దాంతో.. మళ్లీ వెనక్కి క్రీజులోకి రాలేకపోయిన మయాంక్ రనౌట్‌గా వెనుదిరిగాడు. బంతిని అందుకున్న డేవిడ్ వార్నర్ చక్కటి త్రో విసరగా.. ఖలీల్ నెమ్మదిగా బంతిని పట్టుకుని వికెట్లని గీరాటేశాడు.

200పైచిలుకు లక్ష్యఛేదనలో ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ వికెట్ చేజార్చుకోవడం పంజాబ్‌ని దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లోకే లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ గ్లెన్ మాక్స్‌వెల్ (7: 12 బంతుల్లో) కూడా రనౌటవగా.. నికోలస్ పూరన్ (77: 37 బంతుల్లో 5x4, 7x6) మెరుపు ఇన్నింగ్స్‌‌ పంజాబ్‌ని గెలిపించలేకపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.