యాప్నగరం

నేను చెప్పిందేంటి.. మీరు చేసిందేంటి.. బౌలర్లపై ధోనీ ఫైర్!

బౌలర్లూ.. మీకు నేను చెప్పిందేంటి..? మీరు చేసిందేంటి..? బట్లర్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను వదిలేయడమా..? ఓటమి అనంతరం ధోనీ ఫైర్.

Samayam Telugu 12 May 2018, 10:06 am
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌‌పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. 60 బంతుల్లో 95 పరుగులు చేసిన జాస్ బట్లర్ ఒంటిచేత్తో రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. కాగా 176 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్‌లో ఓటమిపాలవడంపై చెన్నై కెప్టెన్ ధోనీ స్పందించాడు. ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీ మ్యాచ్ ముగిసిన అనంతరం బౌలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్కడ బంతులేయాలో బౌలర్లకు సూచించినప్పటికీ.. సరైన ప్రదేశంలో బంతులు విసరడంలో విఫలమయ్యారంటూ విమర్శలు గుప్పించాడు.
Samayam Telugu msd1


177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ను బట్లర్ ఒంటి చేత్తో గెలిపించాడు. అతడికి మరో ఎండ్‌లో సహకరించే వారు కరువయ్యారు. మధ్య ఓవర్లలో అతడు కూడా ఒత్తిడికి గురయ్యాడు. మెల్లగా ఆట రాజస్థాన్ చేతుల్లో నుంచి జారిపోతున్నట్లు కనిపించింది. కానీ చివర్లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ రెండు భారీ సిక్స్‌లు బాదాడు. బ్రావో వేసిన చివరి ఓవర్లో బట్లర్ మ్యాచ్‌ను ముగించాడు.

పిచ్ మీద బంతులు ఎక్కడేయాలని చెబుతామో.. దానికి కట్టుబడి క్రమశిక్షణతో అదే ప్రాంతంలో బంతులు విసరాలి. కానీ బౌలర్లు అలా చేయలేదని ధోనీ మండి పడ్డాడు. ఫీల్డర్లు బట్లర్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను నేలపాలు చేయడంపై మహీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్లానింగ్ బాగున్నప్పటికీ.. దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం అని చెప్పిన ధోనీ నాకౌట్‌కు క్వాలిఫై కావడమే కాదు, విజయాలు సాధించడం ముఖ్యమన్నాడు. బౌలర్లు తమ లెంగ్త్ మార్చుకొని ఎక్కడ, ఎలా బంతులేయాలో తెలుసుకోవాలంటూ చురకలు అంటించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.