యాప్నగరం

గంభీర్‌ హిట్టింగ్.. పంజాబ్ టార్గెట్ 167

ఐపీఎల్‌లో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకి ఆడుతున్న గౌతమ్ గంభీర్.. తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. మొహాలి

Samayam Telugu 8 Apr 2018, 5:52 pm
ఐపీఎల్‌లో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకి ఆడుతున్న గౌతమ్ గంభీర్.. తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ గౌతమ్ గంభీర్ (55: 42 బంతుల్లో 5x4, 1x6) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జట్టులో రిషబ్ పంత్ (28: 13 బంతుల్లో 4x4, 1x6) వరుస బౌండరీలతో మెరిసినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. పంజాబ్ బౌలర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
Samayam Telugu 1


టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారీ అంచనాల మధ్య ఐపీఎల్‌‌లోకి వచ్చిన కొలిన్ మన్రో (4) రివర్స్ స్వీప్ ఆడుతూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయాడు. అనంతరం వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (11: 11 బంతుల్లో 1x4), విజయ్ శంకర్ (13: 13 బంతుల్లో) నిరాశపరిచినా.. కెప్టెన్ గౌతమ్ గంభీర్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఓవర్లలో అతనికి రిషబ్ పంత్‌ తోడవడంతో.. ఢిల్లీ మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. భారీ షాట్ కోసం ప్రయత్నించి జట్టు స్కోరు 111 వద్ద రిషబ్ ఔటవగా.. 123 వద్ద లేని పరుగు కోసం ప్రయత్నించి గంభీర్ రనౌటయ్యాడు. దీంతో.. ఢిల్లీ స్కోరు వేగం మందగించింది. అయితే చివర్లో క్రిస్ మోరీస్ (27 నాటౌట్: 16 బంతుల్లో 1x4, 1x6), డేనియల్ క్రిస్టియాన్ (13: 13 బంతుల్లో 1x6) ఫర్వాలేదనిపించడంతో 166 పరుగులు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.