యాప్నగరం

GT vs SRH: శతకం బాదిన శుభమన్ గిల్.. హైదరాబాద్ టార్గెట్ 189

Shubman Gill ఐపీఎల్‌లో ఎట్టకేలకి సెంచరీ నమోదు చేశాడు. టాప్ ఆర్డర్ నుంచి లభించిన నామమాత్రపు సపోర్ట్‌తో చెలరేగిపోయిన గిల్ గుజరాత్‌కి మెరుగైన స్కోరుని అందించాడు. కానీ.. లాస్ట్‌ ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టేసి.. ఒక రనౌట్ కోసం చేయడంతో కేవలం 2 పరుగులే వచ్చాయి. దాంతో...?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 15 May 2023, 9:41 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌పై సెంచరీ బాదిన గిల్
  • రెండో వికెట్‌కి సుదర్శన్‌తో కలిసి శతక భాగస్వామ్యం
  • ఐదు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్
  • లాస్ట్‌ ఓవర్‌లో 2 పరుగులే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GT vs SRH
శుభమన్ గిల్, సాయి సుదర్శన్
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill)సెంచరీ బాదేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అహ్మదాబాద్ వేదికగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో శుభమన్ గిల్ (101: 58 బంతుల్లో 13x4, 1x6) శతకం బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గిల్‌తో పాటు సాయి సుదర్శన్ (47: 36 బంతుల్లో 6x4, 1x6) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టేశాడు. అలానే జాన్‌సెన్, ఫరూఖి, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ మార్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు దాంతో గిల్‌తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన సాహా (0) ఫస్ట్‌లోనే డకౌటయ్యాడు. అనంతరం వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి శుభమన్ గిల్ దూకుడుగా ఆడేశాడు. రెండో వికెట్‌కి 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గిల్.. ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే.. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఔటైపోగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు.

కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3), దసున్ శనక (9), రషీద్ ఖాన్ (0), నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ (0) వరుసగా ఔటైపోయారు. లాస్ట్ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 2 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదే ఓవర్‌లో నూర్ అహ్మద్ రనౌటయ్యాడు. దాంతో గుజరాత్ 188 రన్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.