యాప్నగరం

రీఎంట్రీ కోసం ధోనీ సన్నాహకాలు భేష్: సీఎస్‌కే కోచ్‌

ఐపీఎల్లో అత్యంత విజ‌య‌వంతమైన సార‌థుల్లో ఎంఎస్ ధోనీ ఒక‌డు. ఇప్ప‌టివ‌ర‌కు చెన్నైకి ప‌దిసార్లు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ధోనీ..మూడుసార్లు విజేత‌గా నిలిపాడు. అలాగే ఐదుసార్లు ర‌న్న‌ర‌ప్‌తో జ‌ట్టు సరిపెట్టుకుంది.

Samayam Telugu 31 Mar 2020, 11:01 am
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కోసం భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) బౌలింగ్ కోచ్ ల‌క్ష్మీప‌తి బాలాజీ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఐపీఎల్లో మునుప‌టి ఫామ్‌ను అందుకునేందుకు త‌న చాలా తీవ్రతతో సాధ‌న చేశాడ‌ని చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్ 13వ ఎడిష‌న్ ఈనెల 29 నుంచి వ‌చ్చేనెల 15కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే టోర్నీ గురించి ప్ర‌స్తుతం బీసీసీఐ వేచి చూసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంది.
Samayam Telugu Chennai: CSK Skipper MS Dhoni during the practice session of the upcoming IPL 20...
CSK Skipper MS Dhoni


Read Also: కరోనా ఫైట్.. సానియా భారీగా నిధుల సేకరణ

మ‌రోవైపు గతేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిశాక అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూర‌మ‌య్యాక‌.. ఐపీఎల్ కోసం ధోనీ చాలా సీరియ‌స్‌గా స‌న్నాహ‌కాలు ప్రారంభించాడు. మార్చి తొలివారంలో కొంత‌కాలంపాటు చెన్నైలో సాధ‌న చేశాడు. ఆ స‌మ‌యంలో ధోనీ చాలా సౌక‌ర్యంగా క‌న్పించాడ‌ని బాలాజీ తెలిపాడు. గ‌తంలో మాదిరిగానే చాలా క‌ఠిన‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నాడని, రెండేళ్ల కింద‌ట ఎంత సీరియ‌స్‌గా సాధ‌న చేసేవాడో, ఇటీవ‌ల కూడా త‌న ప్రాక్టీస్‌ను అలాగే కొన‌సాగించాడని చెప్పుకొచ్చాడు. ధోనీ స‌న్నాహ‌కాల్లో ఎలాంటి మార్పు రాలేదని, అత‌డు ఎప్ప‌టిలాగా చాలా కూల్‌గా క‌న్పించాడని బాలాజీ అన్నాడు.

Read Also: స‌చిన్‌ VS లారా.. నా చాయిస్ అతడే: వార్న్

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరుగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 35 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ న‌డుస్తోంది. ఇది ఏప్రిల్ 14 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అనంత‌రం ఐపీఎల్‌పై స్ప‌ష్ట‌త రానుంద‌ని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.