యాప్నగరం

ఐపీఎల్: పాక్ బౌలర్ 11 ఏళ్ల రికార్డ్ ఎప్పటికీ బ్రేక్ కాదా?

ఐపీఎల్‌లో ఏటేటా అనేక రికార్డులు బ్రేక్ అవుతున్నాయ్. కానీ పాక్ బౌలర్ పేరిట ఉన్న పదకొండేళ్ల నాటి బెస్ట్ బౌలింగ్ రికార్డులను మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేక పోతున్నారు.

Samayam Telugu 6 May 2018, 1:29 pm
ఐపీఎల్‌లో ఏటేటా అనేక రికార్డులు బ్రేక్ అవుతున్నాయ్. కానీ పాక్ బౌలర్ పేరిట ఉన్న పదకొండేళ్ల నాటి బెస్ట్ బౌలింగ్ రికార్డులను మాత్రం ఎవరూ బ్రేక్ చేయలేక పోతున్నారు. అనిల్ కుంబ్లే మొదలుకొని లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, సునీల్ నరైన్ లాంటి బౌలర్లెందరో ఈ రికార్డును బద్దలుకొట్టేందుకు ప్రయత్నించినా.. అది మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది.
Samayam Telugu Sohail Tanvir


పాక్ క్రికెటర్లు ఐపీఎల్‌ తొలి సీజన్లో మాత్రమే ఆడారు. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో దిగిన సోహెల్ తన్వీర్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 14 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇవే ఇప్పటికీ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. దీంతో చెన్నై ఆ మ్యాచ్‌లో 109 పరుగులకే కుప్పకూలింది.

మరుసటి ఏడాది కుంబ్లే 3.1 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 2016లో పుణే తరఫున ఆడిన ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఆరు వికెట్లు తీశాడు. కానీ 19 పరుగులిచ్చాడు. 2011లో లసిత్ మలింగ ఢిల్లీపై ఐదు వికెట్లు తీసి ఊపు మీద కనిపించాడు. కానీ ఆరో వికెట్ మాత్రం తీయలేకపోయాడు. మరి సొహైల్ రికార్డు ఈ సీజన్లోనైనా బద్దలవుతుందా? లేదా ఎప్పటికీ బద్దలు కాదా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.