యాప్నగరం

రాజస్థాన్ జట్టుని కలిసిన ‘ఎవరెస్ట్ కవలలు’

ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తోంది. గత జనవరిలో

Samayam Telugu 4 Apr 2018, 12:01 pm
ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధానికి గురైన రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తోంది. గత జనవరిలో జరిగిన ఆటగాళ్ల వేలంలో రూ. 12.5 కోట్లకి బెన్‌స్టోక్స్‌ని, 11.5 కోట్లకి జయదేవ్ ఉనద్కత్‌లను కొనుగోలు చేసి టోర్నీలో తన పునరాగమనాన్ని ఘనంగా చాటిన రాజస్థాన్.. ఇటీవల బాల్ టాంపరింగ్ ఆరోపణలతో కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ దూరమవడంతో ఢీలా పడిపోయింది. కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపిస్తాడని గంపెడాశలు పెట్టుకున్న స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం వేటు వేయడం రాజస్థాన్ ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. తాజాగా రహానె కెప్టెన్సీ బాధ్యతలు అందుకోగా.. దక్షిణాఫ్రికా హిట్టర్ క్లాసెన్‌ని స్మిత్ స్థానంలో ఫ్రాంఛైజీ భర్తీ చేసింది.
Samayam Telugu 123


స్మిత్ జట్టుకి దూరమవడంతో ఢీలాపడిన ఆటగాళ్లతో స్ఫూర్తినింపేందుకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ.. ఐపీఎల్‌‌కి మూడు రోజుల ముందు ‘ఎవరెస్ట్ ట్విన్స్’తో సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ కవల సోదరీమణులుగా గిన్నీస్ రికార్డు నెలకొల్పిన నంగ్షి మాలిక్, తషి మాలిక్ జైపూర్‌లో ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌కి హాజరై వారితో మాట్లాడారు. పురుషాధిక్యత సమాజంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు.. సాధించిన విజయాలను ఆటగాళ్లతో పంచుకున్నారు. ఎవరెస్ట్‌తో పాటు వరుసగా ఏడు శిఖరాలు అధిరోహించి ‘పర్వతారోహకుల గ్రాండ్‌స్లామ్‌’ని ఈ ట్విన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.