యాప్నగరం

MI vs RR: రోహిత్ స్టంపౌట్ ఎస్కేప్.. నోరెళ్లబెట్టిన స్పిన్నర్

ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన రాజస్థాన్ స్పిన్నర్ గౌతమ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 బాదిన రోహిత్ శర్మ తర్వాత బంతిని కూడా హిట్ చేసేందుకు క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ..

Samayam Telugu 13 Apr 2019, 5:56 pm

ప్రధానాంశాలు:

  • వాంఖడే‌లో స్టంపౌట్ నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ
  • రోహిత్‌కి అందకుండా దూరంగా బంతి విసిరిన స్పిన్నర్ గౌతమ్
  • స్టంపౌట్‌ చేసేందుకు రాజస్థాన్ కీపర్ సంజు శాంసన్ విఫలయత్నం
  • ఆఖరి క్షణంలో తెలివిగా వ్యవహరించిన ముంబయి కెప్టెన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rohit Sharma
Photo Credit: IPL Twitter
ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓ కామెడీ సన్నివేశం చోటుచేసుకుంది. స్పిన్నర్ బౌలింగ్‌లో బంతిని హిట్ చేసేందుకు క్రీజు వెలుపలికి వచ్చిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. ఊహించని రీతిలో బంతి వైడ్‌గా రావడంతో స్టంపౌట్‌ నుంచి తప్పించుకునేందుకు తెలివిగా బంతిని కాలితో తన్నాడు. దీంతో.. ఆ బంతి వికెట్ కీపర్‌కి అందకుండా దూరంగా వెళ్లింది.

ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన రాజస్థాన్ స్పిన్నర్ గౌతమ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 బాదిన రోహిత్ శర్మ (47: 32 బంతుల్లో 6x4, 1x4) తర్వాత బంతిని కూడా హిట్ చేసేందుకు క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. రోహిత్ పాదాల కదలికల్ని గమనించిన గౌతమ్.. రోహిత్‌కి అందకుండా బంతిని లెగ్‌సైడ్ వైడ్ రూపంలో విసిరాడు. దీంతో.. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన రోహిత్ వేగంగా స్పందించి.. బంతిని కాలితో దూరంగా తన్నాడు. అయితే.. తర్వాత ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఫీల్డర్ జోస్ బట్లర్‌కి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.


Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.