యాప్నగరం

CSK vs DC: రిషబ్ పంత్‌కి 4 రన్స్ గిప్ట్‌గా ఇచ్చిన చెన్నై బౌలర్.. ధోనీ మౌనం

బ్యాట్స్‌మెన్ బంతిని నేరుగా బౌలర్‌కి ఫుష్ చేసి.. ఏమాత్రం క్రీజు వెలుపలికి వచ్చినా రనౌట్ చేసే ఉద్దేశంతో బౌలర్ త్రో విసరడం చాలా కామన్. కొంత మంది వికెట్లని టార్గెట్‌గా చేసుకుంటే.. మరికొందరు బ్యాట్స్‌‌మెన్‌కి గురి చూసి విసురుతుంటారు. కానీ.. తాజాగా కరన్..?

Samayam Telugu 26 Sep 2020, 2:58 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన చెన్నై ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ బౌలింగ్‌లో తొలి బంతిని ఢిల్లీ యువ హిట్టర్ రిషబ్ పంత్ స్ట్రయిట్‌గా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో పిచ్‌పై పడిన బాల్ నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో రెండు అడుగులు ముందుకు వేసిన పంత్.. బంతి నేరుగా కరన్ చేతుల్లోకి వెళ్లడం చూసి మళ్లీ క్రీజులోకి వచ్చేశాడు. కానీ.. ఆవేశంలో వికెట్లపైకి బంతిని త్రో చేసిన కరన్ మూల్యం చెల్లించుకున్నాడు.
Samayam Telugu Sam Curran Throw (Screengrab: iplt20.com/video)



రిషబ్ పంత్‌ని రనౌట్ చేసే ఉద్దేశంతో శామ్ కరన్ బంతిని విసరగా.. అది వికెట్లకి దూరంగా లెగ్‌ సైడ్ వెళ్లిపోయింది. అంతకముందే బంతి డాట్ అయినట్లు భావించిన ధోనీ రిలాక్స్‌గా వికెట్ల వెనుక ఉండిపోయాడు. దాంతో.. కరన్ విసిరిన త్రోని ఆఖరి క్షణాల్లో అడ్డుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కీపర్ పక్క నుంచి బంతి నేరుగా బౌండరీకి వెళ్లగా రిషబ్ పంత్ ఖాతాలో 4 పరుగులు చేరాయి. కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే రిషబ్ పంత్‌కి శామ్ కరన్ ఆ బౌండరీని గిప్ట్‌గా ఇచ్చినట్లే.


ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచి డ్వేన్ బ్రావో స్థానంలో ఆల్‌రౌండర్‌‌గా చెన్నై టీమ్‌కి ఆడుతున్న శామ్ కరన్ బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని వయసు 22 ఏళ్లే కావడంతో ధోనీ కూడా ఆ త్రో తప్పిదంపై ఏమీ అనకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. మ్యాచ్‌లో ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో చెన్నైపై గెలుపొందిన విషయం తెలిసిందే.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.