యాప్నగరం

ఐపీఎల్‌లో వామ్మో..? జోప్రా ఆర్చర్ @152 KMPH.. భారత్ నుంచి ఒక్కడే

రాజస్థాన్ రాయల్స్ టీమ్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న జోప్రా ఆర్చర్.. గంటకి 150కిమీ వేగంతో బంతుల్ని సంధిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. భారత బౌలర్లలో సైనీ మినహా ఎవరూ..?

Samayam Telugu 1 Oct 2020, 5:48 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ స్పీడ్‌తో అదరగొట్టేస్తున్నాడు. యూఏఈ వేదికగా టోర్నీ జరుగుతుండగా.. అక్కడి పిచ్‌ల‌పై గంటకి సగటున 150కిమీ వేగంతో బంతుల్ని సంధిస్తున్న జోప్రా ఆర్చర్.. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లకి సైతం చెమటలు పట్టించేస్తున్నాడు. టోర్నీలో జోప్రా ఆర్చర్‌ తరహాలో గంటకి 150కిమీ వేగంతో వరుసగా బంతుల్ని సంధించే బౌలర్‌ కనిపించడం లేదు. ఎంతలా అంటే..? ఐపీఎల్ 2020లో ఫాస్టెస్ట్ బాల్స్‌ జాబితాని పరిశీలిస్తే.. టాప్-7 బాల్స్ జోప్రా ఆర్చర్ విసిరినవే. మొత్తంగా చూసుకున్నా టాప్-20లో ఏకంగా 16 బంతులు జోప్రా ఆర్చర్ సంధించినవే కావడం గమనార్హం.
Samayam Telugu Jofra Archer
Rajasthan Royals player Jofra Archer appeals during IPL 2020 cricket match against Chennai Super Kings batsman, at Sharjah Cricket Stadium, in Sharjah of United Arab Emirates.Photo/Sportzpics)(


ఐపీఎల్‌ 2020లో అత్యధిక వేగంతో బంతులు సంధించిన బౌలర్ల జాబితాలో జోప్రా ఆర్చర్ గంటకి 152.13 కిమీ వేగంతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్తేజ్ 148.92తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ నవదీప్ సైనీ 147.92తో మూడో స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ 147.32తో నాలుగులో ఉన్నాడు. మొత్తంగా టాప్-20లో భారత్‌కి చెందిన సైనీ మాత్రమే చోటు దక్కించుకోగలిగాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన జోప్రా ఆర్చర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఐపీఎల్‌ కెరీర్‌లో 24 మ్యాచ్‌లాడిన ఈ పేసర్ 7.52 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.