యాప్నగరం

ఐపీఎల్ 2020లో రాజస్థాన్ సిక్సర్ల వర్షం.. చెన్నై టార్గెట్ 217

ఐపీఎల్ 2020 సీజన్‌లో సిక్సర్ల వర్షం మొదలైంది. చెన్నై బౌలర్లని ఉతికారేసిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు ఏకంగా 17 సిక్సర్లు బాదేశారు. దాంతో.. 217 పరుగుల టార్గెట్ చెన్నై ముందు నిలిచింది.

Samayam Telugu 22 Sep 2020, 9:50 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో భారీ స్కోరు నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో షార్జా వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో సంజు శాంసన్ (74: 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్‌స్మిత్ (69: 47 బంతుల్లో 4x4, 4x6), జోప్రా ఆర్చర్ (27 నాటౌట్: 8 బంతుల్లో 4x6) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బౌలర్లలో శామ్ కరన్ 3/33తో ఫర్వాలేదనిపించగా.. స్పిన్నర్లు పీయూస్ చావ్లా 1/55, రవీంద్ర జడేజా 0/40, లుంగి ఎంగిడి 1/56 ధారాళంగా పరుగులిచ్చేశారు.
Samayam Telugu RR vs CSK (Photo Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. యశస్వి జైశ్వాల్ (6)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్‌స్మిత్ తొలి ఓవర్‌ నుంచే దూకుడుగా ఆడాడు. అయితే.. జైశ్వాల్ మూడో ఓవర్‌లోనే ఔటవగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే సిక్సర్ల మోత మోగించాడు. స్పిన్నర్ పీయూస్ చావ్లా, రవీంద్ర జడేజాలను టార్గెట్ చేసుకున్న సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో చెలరేగిపోయాడు.


ఈ క్రమంలో స్టీవ్‌స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంజు శాంసన్ జట్టు స్కోరు 132 వద్ద ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ (0), రాబిన్ ఉతప్ప (5), రాహుల్ తెవాటియా (10), ప్రియమ్ గార్గెట్ (6), టామ్ కరన్ (10) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దాంతో.. రాజస్థాన్ 200లోపే స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. ఆఖరి ఓవర్‌ వేసిన లుంగి ఎంగిడి బౌలింగ్‌లో జోప్రా ఆర్చర్ వరుసగా 6, 6, 6, 6 బాదేయగా.. రాజస్థాన్ ఆ ఓవర్‌లో 30 పరుగుల్ని రాబట్టేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.