యాప్నగరం

నోరుజారిన విరాట్ కోహ్లీ.. సిక్స్‌తో బదులిచ్చిన మనీశ్ పాండే

హైదరాబాద్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ గోస్వామి వికెట్ చేజార్చుకోవడంతో.. క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే కాస్త ఆచితూచి ఆడుతూ కనిపించాడు. దాంతో.. స్లో స్టార్ట్‌పై కోహ్లీ కవ్వింపులకి దిగగా.. మనీశ్ భారీ సిక్స్ బాదేశాడు.

Samayam Telugu 7 Nov 2020, 8:50 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి ఆటగాళ్లపై తరచూ నోరు పారేసుకుంటూ కనిపించాడు. ఇటీవల ముంబయి ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై కోహ్లీ స్లెడ్జింగ్‌కి దిగగా.. అతను 43 బంతుల్లోనే 79 పరుగుల చేసి బెంగళూరు ఓటమికి కారణమయ్యాడు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ మనీశ్ పాండేపై కోహ్లీ నోరుజారగా.. రెండు బంతుల వ్యవధిలోనే మనీశ్ భారీ సిక్స్‌తో అతనికి బదులిచ్చాడు.
Samayam Telugu Manish Pandey Six (Screengrab:IPL/Video)



132 పరుగుల ఛేదనలో హైదరాబాద్ ఆరంభంలోనే శ్రీవాత్సవ గోస్వామి (0) వికెట్ చేజార్చుకోగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే మూడో ఓవర్‌ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడుతూ కనిపించాడు. దాంతో.. తొలి మూడు బంతులూ డాట్ అవగా.. మనీశ్ పాండే వైపు హేళనగా చూస్తూ విరాట్ కోహ్లీ నోరుజారాడు. కోహ్లీ మాటలు విన్న మనీశ్.. అప్పుడు మౌనంగా ఉన్నప్పటికీ.. అదే ఓవర్‌లో కళ్లు చెదిరే తరహాలో మిడ్ వికెట్ దిశగా భారీ సిక్స్ బాదేశాడు.


మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించిన హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దాంతో.. సీజన్ నుంచి బెంగళూరు నిష్క్రమించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో అబుదాబి వేదికగానే క్వాలిఫయర్-2లో హైదరాబాద్ తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.