యాప్నగరం

RR vs SRH: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ 159

ఐపీఎల్ 2020 సీజన్‌లో మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సత్తాచాటాల్సిన సమయం వచ్చింది. దుబాయ్ పిచ్‌పై బ్యాటింగ్ కష్టమవడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 158/4కే పరిమితమైంది.

Samayam Telugu 11 Oct 2020, 5:39 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తక్కువ స్కోరు‌కి పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. మనీశ్ పాండే (54: 44 బంతుల్లో 2x4, 3x6), డేవిడ్ వార్నర్ (48: 38 బంతుల్లో 3x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో జోప్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీశారు.
Samayam Telugu Manish Pandey (Photo Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఆరంభంలోనే ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (16: 19 బంతుల్లో 1x6) ఔటవగా.. అనంతరం వచ్చిన మనీశ్ పాండే‌తో కలిసి డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. టీమ్ స్కోరు 96 వద్ద వార్నర్ ఔటవగా.. తర్వాత కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ నమోదు చేసిన మనీశ్ పాండే కూడా పెవిలియన్ కూడా చేరిపోయాడు.


క్రీజులో సెటిలైన్ బ్యాట్స్‌మెన్‌‌లు వరుసగా ఔటవడంతో సన్‌రైజర్స్ 150 పరుగుల మార్క్‌నైనా అందుకుంటుందా..? అనే సందేహాలు రేకెత్తాయి. కానీ.. చివర్లో కేన్ విలియమ్సన్ (22 నాటౌట్: 12 బంతుల్లో 2x6), ప్రియమ్ గార్గ్ (15: 8 బంతుల్లో 1x4, 1x6) బ్యాట్ ఝళిపించడంతో హైదరాబాద్ 158 పరుగులు చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.