యాప్నగరం

ఉప్పల్‌లో కామెరూన్ గ్రీన్ మెరుపులు.. హైదరాబాద్ టార్గెట్ 193

SRH vs MI మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. అతనితో పాటు లోకల్ బాయ్ తిలక్ వర్మ కూడా భారీ సిక్సర్లు కొట్టడంతో ముంబయి టీమ్ మెరుగైన స్కోరుని అందుకోగలిగింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 18 Apr 2023, 9:36 pm

ప్రధానాంశాలు:

  • ఉప్పల్‌లో హాఫ్ సెంచరీ బాదిన కామెరూన్ గ్రీన్
  • నిరాశపరిచిన రోహిత్ శర్మ.. గేర్ మార్చలేకపోయిన ఇషాన్
  • రెండు వికెట్లు పడగొట్టిన జాన్‌సెన్
  • ఆఖర్లో తిలక్ వర్మ సిక్సర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Cameron Green
కామెరూన్ గ్రీన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్ ముందు ఉప్పల్‌లో భారీ టార్గెట్‌ని ముంబయి ఇండియన్స్ నిలిపింది. మంగళవారం రాత్రి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ టీమ్.. కామెరూన్ గ్రీన్ (64 నాటౌట్: 40 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీ బాదడంతో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్‌సెన్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్ చెరో వికెట్ తీశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్‌క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముంబయి ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ (28: 18 బంతుల్లో 6x4), ఇషాన్ కిషన్ (38: 31 బంతుల్లో 3x4, 2x6) తొలి వికెట్‌కి 4.4 ఓవర్లలో 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో నటరాజన్‌కి రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకోగా.. 12వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా.. ఇషాన్ కిషన్ గేర్ మార్చలేకపోయాడు.

కానీ.. నెం.3లో వచ్చిన కామెరూన్ గ్రీన్ ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ (7) నుంచి సపోర్ట్ లభించకపోయినా.. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (37: 17 బంతుల్లో 2x4, 4x6) చక్కటి సహకారం అందించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (16: 11 బంతుల్లో 2x4) బంతుల్ని వేస్ట్ చేశాడు. అయినప్పటికీ ముంబయి మెరుగైన స్కోరుని అందుకోగలిగింది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.