యాప్నగరం

IPL Media Rights‌ని దక్కించుకున్న టైమ్స్ ఇంటర్నెట్.. వయాకామ్18 భాగస్వామిగా

Times Internet ఐపీఎల్ మీడియా హక్కుల్ని సొంతం చేసుకుంది. వయాకామ్18తో కలిసి ఐదేళ్లకాలానికి (2023-2027 ) విదేశీ టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల్ని దక్కించుకుంది. ఈ ప్యాకేజీ విలువ రూ.1058 కోట్లు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 15 Jun 2022, 8:32 am

ప్రధానాంశాలు:

  • భారీ ధరకి అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్
  • డిస్నీ స్టార్‌ చేతికి టీవీ ప్రసార హక్కులు
  • వయాకామ్18తో కలిసి ప్యాకేజీ-డిని సొంతం చేసుకున్న టైమ్స్ ఇంటర్నెట్
  • ప్యాకేజీ-డిలో 410 మ్యాచ్‌లు.. విలువ రూ.1058 కోట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu IPL Media Rights (Pic Source: Twitter)
ఐపీఎల్ మీడియా రైట్స్‌ ఈ-వేలం (IPL Media Rights e-auction) మంగళవారం రాత్రి ముగిసింది. 2023 నుంచి 2027 వరకూ మొత్తం ఐదేళ్లకాలానికి టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ-వేలానికి ఉంచగా.. ఎవరూ ఊహించని విధంగా ఆ హక్కులు రూ.48,390 కోట్లకి అమ్ముడుపోయాయి. ఉపఖండపు టీవీ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌ని డిస్నీ స్టార్ రూ.23,575 కోట్లకి సొంతం చేసుకుంది. ఈ లెక్కన ఐదేళ్ల పాటు ఒక్కో మ్యాచ్‌కి డిస్నీ స్టార్ రూ.57.5 కోట్లని బీసీసీఐకి చెల్లించునుంది.

భారత్‌లో డిజిటల్ రైట్స్‌ని రిలయన్స్‌కి చెందిన వయాకామ్18 (Viacom18) సంస్థ దక్కించుకుంది. ఐదేళ్లకాలానికి రూ.20,500 కోట్లని బీసీసీఐకి వయాకామ్18 చెల్లించబోతోంది. అలానే నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ (వీకెండ్ మ్యాచ్‌లు, స్పెషల్ మ్యాచ్‌లు) ఉన్న ప్యాకేజీ-సిని కూడా వయాకామ్18 సొంతం చేసుకుంది. ఇక ప్యాకేజీ-డి రూపంలో ఉన్న విదేశీ టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల్ని వయాకామ్18తో కలిసి టైమ్స్ ఇంటర్నెట్ (Times Internet ) దక్కించుకుంది. ఈ ప్యాకేజీ విలువ రూ.1058 కోట్లు. మొత్తంగా.. డిజిటల్ రైట్స్ రూపంలో బీసీసీఐకి రూ.23,758 కోట్ల ఆదాయం చేకూరింది. ఓవరాల్‌గా ఒక్కో మ్యాచ్‌కి రూ.118 కోట్ల ఆదాయం బీసీసీఐకి రానుంది.
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి పదేళ్లకాలానికి అంటే 2017 వరకూ మీడియా హక్కుల్ని అప్పట్లో సోనీ కేవలం రూ.8,200 కోట్లకే సొంతం చేసుకుంది. కానీ.. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్లకాలానికి స్టార్ ఈ హక్కుల్ని రూ.16,347 కోట్లకి దక్కించుకోగా.. ఇప్పుడు 2023 నుంచి 2027 వరకూ ఐదేళ్లకాలానికి ఈ మీడియా హక్కుల ధర 48,390 కోట్లకి చేరుకోవడం గమనార్హం.

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోటీపడగా.. 74 మ్యాచ్‌లు జరిగాయి. అలానే 2023, 2024లోనూ 74 మ్యాచ్‌లే జరగనుండగా.. ఆ తర్వాత 2025, 2026లో ఆ మ్యాచ్‌ల సంఖ్య 84కి చేరనుంది. ఇక 2027లో మాత్రం ఆ సంఖ్యని ఏకంగా 94‌కి పెంచబోతున్నట్లు బీసీసీఐ చెప్తోంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.