యాప్నగరం

రోహిత్ శర్మ.. దేశం తరఫున ఆడటం కంటే ఐపీఎల్ ముఖ్యమా?: మాజీ చీఫ్ సెలక్టర్

Team India తరఫున ఆడటం కంటే రోహిత్ శర్మకు ఐపీఎల్ ఆడటమే ముఖ్యమా? అని మాజీ చీఫ్ సెలక్టర్ వెంగ్ సర్కార్ బీసీసీఐని ప్రశ్నించాడు.

Samayam Telugu 4 Nov 2020, 12:29 pm
ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. కానీ గాయం కారణంగానే ఆస్ట్రేలియా పర్యటకు సెలక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు. గ్రేడ్ 2 హ్యామ్‌స్ట్రింగ్ టియర్ ఇంజ్యూరీ కారణంగా ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్... సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆడాడు. రోహిత్‌ ఫిట్‌నెస్‌తో లేడని గంగూలీ చెప్పిన కొద్ది గంటల్లోనే రోహిత్ ఐపీఎల్ మ్యాచ్ ఆడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Samayam Telugu Rohit sharma
Image: IPL/BCCI


రోహిత్ శర్మ గాయం గురించి బీసీసీఐ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటన జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పని చేసిన దిలీప్ వెంగ్ సర్కార్... ఈ విషయమై కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

‘‘భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన రోహిత్ శర్మ ఫిట్‌గా లేడని కొద్ది రోజుల క్రితం ఫిజియో నితిన్ పటేల్ ప్రకటించాడు. దాని ఆధారంగా అతణ్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ అతడు ఐపీఎల్‌లో ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు’’ అని వెంగ్ సర్కార్ వ్యాఖ్యానించారు.

రోహిత్ శర్మకు దేశం తరఫున ఆడటం కంటే ఐపీఎల్‌లో ఆడటమే ముఖ్యమా అని వెంగ్ సర్కార్ ప్రశ్నించారు. టీమిండియా తరఫున ఆడటం కంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడికి ముఖ్యమా? ఈ విషయంలో బీసీసీఐ స్పందిస్తుందా..? లేదంటే బీసీసీఐ ఫిజియో రోహిత్ గాయాన్ని సరిగా నిర్ధారించలేకపోయాడా? అని వెంగ్ సర్కార్ ప్రశ్నించారు.

రోహిత్ శర్మకు ఆదివారం ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. కానీ రిజల్ట్‌ను బహిర్గతం చేయలేదు. కొద్ది రోజులపాటు రోహిత్‌ను పరిశీలిస్తామని.. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ తెలిపాడు. కానీ రోహిత్ మాత్రం తాను ఫిట్‌గా ఉన్నానని ప్రకటించాడు. ఈ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.