యాప్నగరం

IPL 2023 ముంగిట పంజాబ్ కింగ్స్‌కి పవర్ హిట్టర్ ఝలక్.. ఇప్పుడెలా?

Punjab Kings కి ఐపీఎల్ 2023 ముంగిట గాయం దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా సీజన్ మొత్తానికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అతని స్థానంలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి? అనేదానిపై పంజాబ్ చర్చిస్తోంది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 21 Mar 2023, 8:14 pm

ప్రధానాంశాలు:

  • మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు
  • పంజాబ్ తన ఫస్ట్ మ్యాచ్‌లో కోల్‌కతాతో ఢీ
  • ఐపీఎల్ 2023కి దూరంగా జానీ బెయిర్‌స్టో?
  • ప్రత్యామ్నాయంపై పంజాబ్ ముల్లగుల్లాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jonny Bairstow
జానీ బెయిర్‌స్టో
ఐపీఎల్ 2023 (IPL 2023) ముంగిట పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కి ఇంగ్లాండ్ టీమ్ పవర్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow) ఝలక్ ఇచ్చాడు. గత కొంత కాలంగా గాయంతో ఆటకి దూరంగా ఉంటున్న జానీ బెయిర్‌స్టో ఐపీఎల్ 2023కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి అతను గాయం నుంచి ఇటీవల కోలుకున్నట్లు కనిపించాడు. నెట్స్‌లో కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది.
కానీ.. ఈ ఏడాది యాషెష్ సిరీస్ ఉండటంతో ఆ సిరీస్ టైమ్‌కి పూర్తి ఫిట్‌గా ఉండాలని బెయిర్‌స్టో ఆశిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ 2023 మొత్తానికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 1న తన ఫస్ట్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది.

కాలి గాయం కారణంగా పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకి దూరంగా ఉండిపోయిన జానీ బెయిర్‌స్టో సర్జరీ కూడా చేయించుకున్నాడు. అతని కాలికి మెటల్ ప్లేట్‌ని కూడా డాక్టర్లు అమర్చారు. అయినప్పటికీ వేగంగా కోలుకుని ఇటీవల నెట్స్‌లో బంతిని బలంగా బాదుతూ కనిపించాడు. కానీ 100% కోలుకోకుండానే ఐపీఎల్‌లో ఆడితే గాయం తిరగబడే ప్రమాదం ఉందని బెయిర్‌స్టో భావిస్తున్నాడు. దాంతో అతని స్థానంలో ప్లేయర్ కోసం పంజాబ్ వేటని మొదలుపెట్టింది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లాడిన జానీ బెయిర్‌స్టో.. 142.65 స్ట్రైక్‌రేట్‌తో 1291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే 133 ఫోర్లు, 55 సిక్సర్లని జానీ బెయిర్‌స్టో కొట్టాడు. 2019 నుంచి ఐపీఎల్‌లో జానీ బెయిర్‌స్టో ఆడుతున్నాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.