యాప్నగరం

బ్రదర్‌తో కలిసి క్రీడా స్ఫూర్తి చాటిన రాహుల్

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఒంటి చేత్తో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసిన రాహుల్.. మ్యాచ్ అనంతరం క్రీడా స్ఫూర్తి చాటాడు.

Samayam Telugu 17 May 2018, 9:53 am
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు అవసరమైన దశలో రాహుల్‌ను బుమ్రా ఔట్ చేయడంతో.. మ్యాచ్ ముంబై వైపు మొగ్గింది. ఫించ్‌ (35 బంతుల్లో 46)తో కలిసి రాహుల్ (60 బంతుల్లో 94) 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో విజయంపై పంజాబ్ ధీమాగా ఉంది. కానీ చివర్లో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మార్చేశాడు.
Samayam Telugu kl rhaul hardik


ఈ సీజన్లో ఆరు అర్ధ సెంచరీలు చేసి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్న రాహుల్ (95*) రాజస్థాన్‌పై విజయం కోసం కడదాకా పోరాడాడు. ముంబై మీద కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కానీ జట్టు ఓటమితో రాహుల్ నిరాశ చెందాడు. తీవ్రంగా పోరాడిన ఓడినప్పటికీ.. కేఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.

మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య, రాహుల్ కలిసి ఫుట్ బాల్ ఆటగాళ్ల తరహాలో జెర్సీలు మార్చుకున్నారు. ఫలితం ఎలా ఉన్నా ఆటే ముఖ్యం అనే స్ఫూర్తి చాటారు. రాహుల్, పాండ్య ఇద్దరు క్రికెటర్లు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా.. వేరే తల్లికి పుట్టిన నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలంటూ హార్దిక్ బర్త్ డే విషెస్ చెప్పాడు. దీన్ని బట్టే వీరిద్దరూ ఎలాంటి మిత్రులో అర్థం చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.