యాప్నగరం

కేఎల్ రాహుల్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డ్!

పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు.

Samayam Telugu 8 Apr 2018, 6:28 pm
పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. యూసఫ్ పఠాన్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2014లో కోల్‌కతాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ ఈ రికార్డ్ నెలకొల్పాడు. అలాగే బెంగళూరు ఆటగాడు సునీల్ నరైన్ కూడా 15 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ఇక సురేష్ రైనా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.
Samayam Telugu Rahul


ఇదిలా ఉంటే, ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఢిల్లీకి బ్యాటింగ్ అప్పగించాడు. ఢిల్లీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (55; 42 బంతుల్లో 5x4, 1x6) అర్ధశతకం బాదడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్ (51; 15 బంతుల్లో 6x4, 4x6), మయాంక్ అగర్వాల్ (7; 5 బంతుల్లో 1x6) శుభారంభాన్ని ఇచ్చారు. తొలి నుంచి దూకుడుగా ఆడిన రాహుల్.. బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి మూడు బంతుల్లో వరసగా సిక్స్, ఫోర్, ఫోర్ బాదాడు. ఆ తరవాత షమీ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఇక స్పిన్నర్ మిశ్రా వేసిన మూడో ఓవర్‌లో ఊచకోత కోశాడు. మొదటి ఐదు బంతుల్లో వరసగా 4, 6, 6, 4, 4 బాది అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతంగా 50 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.