యాప్నగరం

కోల్‌కతా స్పిన్నర్ల మ్యాజిక్.. లక్ష్య చేధనలో ఢిల్లీ చిత్తు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి 129 పరుగులకే కుప్పకూలింది.

Samayam Telugu 16 Apr 2018, 11:31 pm
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి 129 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ చెరో మూడు వికెట్లు తీసిన వేళ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్లోనే రాయ్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లన కోల్పోయింది.
Samayam Telugu kkr1


ఢిల్లీ బ్యాటింగ్‌లో.. రిషబ్ పంత్ (26 బంతుల్లో 43), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 47) మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు.

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. నితీష్ రాణా (35 బంతుల్లో 59), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 41) దూకుడుగా ఆడారు. దీంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.