యాప్నగరం

IPL Score Updates: బెంగళూరుపై బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా

బెంగళూరు జట్టులో పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. కోల్‌కతా జట్టులోని ఆండ్రీ రసెల్ ఇప్పటి వరకూ ఒక్కటి కూడా గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాంతో.. ఈ మ్యాచ్‌కి రసెల్ స్థానంలో టామ్ బాంటన్‌ని మ్యాచ్‌లోకి కోల్‌కతా తీసుకుంది.

Samayam Telugu 21 Oct 2020, 7:26 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. స్పిన్నర్ షబాజ్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ని తీసుకున్నాడు. కోల్‌కతా తుది జట్టులోనూ రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్, శివమ్ మావి స్థానంలో.. ప్రసీద్, టామ్ బాంటన్ టీమ్‌లోకి వచ్చారు.
Samayam Telugu KKR vs RCB (Image Source: Twitter)


తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన బెంగళూరు టీమ్ ఆరింట్లో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 9 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఐదింట్లో విజయం సాధించి నాలుగో స్థానంలో ఉంది. ‌‌చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ బెంగళూరు మూడింట్లో గెలుపొందగా.. కోల్‌కతా కూడా మూడింట్లో గెలిచింది. దాంతో.. ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది.

బెంగళూరు టీమ్‌లో ఓపెనర్లు పడిక్కల్, అరోన్ ఫించ్ మంచి టచ్‌లో కనిపిస్తుండగా.. మిడిలార్డర్‌‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నారు. బౌలింగ్‌లోనూ చాహల్, నవదీప్ సైనీ, ఇసుర ఉదాన, క్రిస్ మోరీస్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. వికెట్లు పడగొడుతూ టీమ్‌ని గెలిపిస్తున్నారు.

కోల్‌కతా జట్టులో ఓపెనర్ శుభమన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. అతని ఇన్నింగ్స్‌లో దూకుడు లోపిస్తోంది. దాంతో పవర్ ప్లే‌లో కోల్‌కతా మెరుగైన స్కోరుని అందుకోలేకపోతోంది. ఇక మిడిలార్డర్‌లో దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్‌ మెరుపులు కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతుండగా.. నితీశ్ రాణా వైఫల్యం ఆ జట్టుని దెబ్బతీస్తోంది. బౌలింగ్‌లో పాట్ కమిన్స్‌‌కి లూకీ ఫర్గూసన్ తోడవడంతో ఆ జట్టు బలం పెరిగింది. కానీ.. యువ బౌలర్లు శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి పరుగులిచ్చేస్తుండటం బలహీనతగా మారింది.

Kolkata Knight Riders (Playing XI): Shubman Gill, Tom Banton, Nitish Rana, Eoin Morgan(c), Dinesh Karthik(w), Rahul Tripathi, Pat Cummins, Lockie Ferguson, Kuldeep Yadav, Prasidh Krishna, Varun Chakravarthy

Royal Challengers Bangalore (Playing XI): Devdutt Padikkal, Aaron Finch, Virat Kohli(c), AB de Villiers(w), Gurkeerat Singh Mann, Washington Sundar, Chris Morris, Isuru Udana, Mohammed Siraj, Navdeep Saini, Yuzvendra Chahal

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.