యాప్నగరం

ఇదెక్కడి బౌలింగ్ యాక్షన్ తివారీ..?

ఐపీఎల్ 2018 సీజన్‌కి లసిత్ మలింగ, కేదార్ జాదవ్ (గాయంతో) దూరమైనా.. వారిని ఒక్క ఓవర్‌ బౌలింగ్‌తోనే గుర్తుకు తెచ్చాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్

Samayam Telugu 27 Apr 2018, 5:46 pm
ఐపీఎల్ 2018 సీజన్‌కి లసిత్ మలింగ, కేదార్ జాదవ్ (గాయంతో) దూరమైనా.. వారిని ఒక్క ఓవర్‌ బౌలింగ్‌తోనే గుర్తుకు తెచ్చాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ మనోజ్ తివారీ. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో.. అనూహ్యంగా ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసేందుకు మనోజ్ తివారీ చేతికి పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బంతినిచ్చాడు. సగం మలింగ, సగం కేదార్ జాదవ్ బౌలింగ్ శైలిని మిక్స్ చేస్తూ భిన్నమైన శైలిలో బౌలింగ్ చేసిన మనోజ్ తివారీ.. ఆ ఓవర్‌లో 10 పరుగులిచ్చాడు.
Samayam Telugu 2


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 132 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో విఫలమైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 119 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. హిట్టర్ యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మనోజ్ తివారీ (1).. బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అతను 5 బంతులాడి పేలవ రీతిలో సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.