యాప్నగరం

మూడో ఐపీఎల్ టైటిల్‌పై కన్నేసిన చెన్నై

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈరోజు రాత్రి 7 గంటలకి జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యుత్తమ జట్టుతో తాము బరిలోకి దిగనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్

Samayam Telugu 27 May 2018, 3:33 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈరోజు రాత్రి 7 గంటలకి జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో అత్యుత్తమ జట్టుతో తాము బరిలోకి దిగనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వెల్లడించాడు. టోర్నీ మధ్యలో గాయాలు చెన్నైని ఇబ్బందిపెట్టినా.. ఇప్పుడు జట్టులో ఆటగాళ్ల వయసుకి సంబంధించిన ఆందోళనే తప్ప గాయాల సమస్య లేదని ధోనీ స్పష్టం చేశాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు ప్రతీకారం తీర్చుకుని రెండో టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ఆశిస్తుండగా.. రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై మూడో టైటిల్‌పై కన్నేసింది.
Samayam Telugu ..


‘చెన్నై జట్టులో ఎక్కువ వయసు ఉన్న ఆటగాళ్లు ఉండటం ఆందోళన కలిగించే అంశమే. వారు గాయపడకుండా చూసుకుంటూనే ఫిట్‌గా ఉంచాల్సి ఉంటుంది. టోర్నీ ఆరంభం నుంచి మేము చేసింది అదే. అందుకే.. ఇప్పుడు బెస్ట్ ఎలెవన్ ఆటగాళ్లు సెలక్షన్‌కి అందుబాటులో ఉన్నారు’ అని ధోనీ వెల్లడించాడు. టోర్నీలో స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి ఎక్కువ బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ ‘జట్టులో ఏడుగురు బౌలర్లు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ..నేను ప్రతిసారి మ్యాచ్ గమనాన్ని పరిగణలోకి తీసుకుని బౌలర్‌కి అవకాశం ఇస్తాను. క్రీజులో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎవరు ఉన్నారు..? ఆ సమయంలో రాణించగలిగే బౌలర్ ఎవరు..? అని ఆలోచిస్తాను. మొత్తంగా జట్టు ప్రయోజనాలను అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా’ అని చెన్నై కెప్టెన్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.