యాప్నగరం

Ambati Rayudu గాయంపై ధోనీ అప్‌డేట్.. డ్రెస్సింగ్ రూములో అలా

ముంబయి ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే విసిరిన బంతి బౌన్స్ అవుతుందని ఊహించిన అంబటి రాయుడు.. కిందకి వంగాడు. కానీ.. బంతి అనూహ్యంగా వచ్చి అతని మోచేతికి తాకింది. దాంతో...

Samayam Telugu 20 Sep 2021, 8:03 am

ప్రధానాంశాలు:

  • ముంబయితో మ్యాచ్‌లో గాయపడిన అంబటి రాయుడు
  • రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తెలుగు క్రికెటర్
  • రాయుడి గాయంపై అప్‌డేట్ చెప్పిన ధోనీ
  • డ్రెస్సింగ్ రూములో నవ్వుతూ కనిపించిన రాయుడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ambati Rayudu Injury (Pic Credit: IPL/BCCI)
ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు గాయపడ్డాడు. ముంబయి ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే విసిరిన వేగవంతమైన డెలివరీని అంచనా వేయలేకపోయిన అంబటి రాయుడు (0 రిటైర్డ్ హర్ట్).. షార్ట్ పిచ్ బాల్ అనుకుని కిందకి వంగే ప్రయత్నం చేశాడు. కానీ.. ఎక్కువ బౌన్స్ అవని బంతి నేరుగా వచ్చి అతని మోచేతికి బలంగా తాకింది.
మోచేతికి.. అదీ కొత్త బంతి కావడంతో నొప్పితో విలవిలలాడిపోయిన అంబటి రాయుడు.. ఫిజియో సపర్యల తర్వాత అతనితో కలిసి మైదానం వీడాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్: 58 బంతుల్లో 9x4, 4x6) హాఫ్ సెంచరీ బాదడంతో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సౌరభ్ తివారి (50 నాటౌట్: 40 బంతుల్లో 5x4) అజేయ హాఫ్ సెంచరీ బాదినా.. ముంబయి టీమ్‌ ఆఖరికి 136/8కే పరిమితమైంది. మ్యాచ్‌లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

అంబటి రాయుడి గాయంపై మ్యాచ్ ముగిసిన తర్వాత మహేంద్రసింగ్ ధోనీ మాట్లాడుతూ ‘‘డ్రెస్సింగ్ రూములో అంబటి రాయుడు నవ్వుతూ కనిపించాడు. కాబట్టి.. అతని మోచేతి గాయం తీవ్రమైనది కాదు. తర్వాత మ్యాచ్‌కి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. అతను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించడానికి ఆ వ్యవధి ఉపయోగపడుతుంది. ఫిట్‌నెస్, పరిస్థితుల్ని బట్టి.. తర్వాత మ్యాచ్‌లో అతను ఆడటంపై నిర్ణయం తీసుకుంటా’’ అని ధోనీ వెల్లడించాడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాత మ్యాచ్‌ని ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.