యాప్నగరం

CSK: ధోనీ.. ఈ ఒక్క మార్పు చేస్తే సరిపోతుంది.. అగార్కర్ సలహా

IPL 2020లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమవుతున్న వేళ.. ధోనీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అజిత్ అగార్కర్ మహీకి ఓ సలహా ఇచ్చాడు.

Samayam Telugu 21 Oct 2020, 1:19 pm
ఐపీఎల్ ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఈ సీజన్లో అదరగొడతాని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. ధోనీ ఆటతీరు సైతం పేలవంగా ఉండటంతో.. కెప్టెన్సీలో మునుపటి చురుకుదనం లేకపోవడంతో.. గతంలో అతణ్ని పొగిడినవారే ఇప్పుడు విమర్శిస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కూడా కొందరు డిమాడ్ చేస్తున్నారు.
Samayam Telugu ​MS Dhoni
MS Dhoni. (BCCI/IPL/ANI Photo)


టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగర్కార్ మాత్రం ధోనీకి మద్దతుగా నిలిచాడు. ధోనీ ఒక చిన్న మార్పు చేస్తే సరిపోతుందని చెప్పాడు. ఐదో స్థానం కంటే దిగువన మహీ బ్యాటింగ్ చేయొద్దని అగర్కార్ సూచించాడు. పరిస్థితిని బట్టి అతడు బ్యాటింగ్‌కు దిగే స్థానాన్ని మార్చుకోవచ్చు. కానీ ఐదో స్థానం కంటే దిగువన మాత్రం ఆడొద్దని సలహా ఇచ్చాడు.

ప్రపంచంలోని గొప్ప క్రికెట్ బ్రెయిన్లలో ధోనీ ఒకడన్న అగార్కర్.. ఇతర ఆటగాళ్లు అంచనా వేయలేకపోయినా.. ధోనీ పరిస్థితులకు తగ్గట్టుగా అంచనాలు వేస్తాడని.. టోర్నీ గడిచే కొద్దీ అతడి ఫామ్ కూడా మెరుగువతుందని అగార్కర్ స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.