యాప్నగరం

Yuzvendra Chahal బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ 6, 6, 6.. ఔట్

ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో తొలి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 6‌గా మలిచిన యువరాజ్.. నాలుగో బంతిని కూడా సిక్స్‌గా తరలించే ప్రయత్నంలో.. ఔటయ్యాడు.

Samayam Telugu 5 Apr 2019, 6:23 pm
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హిట్టర్ యువరాజ్ సింగ్ (23: 12 బంతుల్లో 3x6) హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో తొలి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 6‌గా మలిచిన యువరాజ్.. నాలుగో బంతిని కూడా సిక్స్‌గా తరలించే ప్రయత్నంలో.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ మహ్మద్ సిరాజ్ చేతికి చిక్కాడు. సిక్స్‌గా వెళ్తున్న బంతిని.. సిరాజ్ చక్కగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు.
Samayam Telugu Yuvi 1


రోహిత్ శర్మ (48: 33 బంతుల్లో 8x4, 1x6), హార్దిక్ పాండ్య (32 నాటౌట్: 14 బంతుల్లో 2x4, 3x6) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్ (70 నాటౌట్: 41 బంతుల్లో 4x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. జట్టుని గెలిపించలేకపోయాడు. దీంతో.. బెంగళూరు ఆఖరికి 181/5కే పరిమితమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.