ఐపీఎల్ 2023 (IPL 2023)లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) టీమ్.. నాలుగో మ్యాచ్‌లోనూ 172 పరుగులకి ఆలౌటైంది. ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ (54: 25 బంతుల్లో 4x4, 5x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. అయినప్పటికీ మిగిలిన బ్యాటర్లు నిరాశపరచడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకి కుప్పకూలిపోయింది. అక్షర్‌తో పాటు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (51: 47 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ బాదినా.. మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బెరండ్రాఫ్, పీయూస్ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టగా.. మెరాడిత్ రెండు, హృతిక్ ఒక వికెట్ తీశాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ పృథ్వీ షా (15) మరోసారి ఫెయిలయ్యాడు. అనంతరం వచ్చిన మనీశ్ పాండే (26), యశ్ ధూళ్ (2), రోవ్‌మెన్ పొవెల్ (2) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా డేవిడ్ వార్నర్ వికెట్ కాపాడుకుంటూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో మిడిల్ ఓవర్లలో అతనితో జత కలిసిన అక్షర్ పటేల్ భారీ సిక్సర్లు బాదేశాడు. దాంతో ఆరో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ.. టీమ్ స్కోరు 165 వద్ద అక్షర్ ఔటైపోయాడు.
అక్షర్ ఔట్ తర్వాత వచ్చిన అభిషేక్ (1), కుల్దీప్ యాదవ్ (0), ఆన్రిచ్ నోకియా (5) తక్కువ స్కోరుకే వరుసగా ఔటైపోయారు. దాంతో 172 పరుగులతోనే ఢిల్లీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముంబయి, ఢిల్లీ జట్లు తాజా సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. దాంతో ఏ జట్టు గెలిచినా.. ఆ టీమ్‌కి ఇది బోణినే.
Read Latest Sports News, Cricket News, Telugu News, IPL 2023 News