యాప్నగరం

MI vs KKR: ప్లేఆఫ్ రేసులోనే ముంబయి.. కోల్‌కతాపై అలవోక గెలుపు

ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మళ్లీ తడబడింది

Samayam Telugu 6 May 2018, 8:01 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. తొలుత ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ (59: 39 బంతుల్లో 7x4, 2x6), ఎవిన్ లావిస్ (43: 28 బంతుల్లో 5x4, 2x6), హార్దిక్ పాండ్య (35 నాటౌట్: 20 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు.. అనంతరం కోల్‌కతాని 168 పరుగులకే కట్టడి చేసేసింది. ఛేదనలో రాబిన్ ఉతప్ప (54: 35 బంతుల్లో 6x4, 3x6), నితీశ్ రాణా (31: 27 బంతుల్లో 3x4, 1x6) దినేశ్ కార్తీక్ (36 నాటౌట్: 26 బంతుల్లో 5x4, 1x6) మెరిసినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో కోల్‌కతాకి ఓటమి తప్పలేదు. ఆ జట్టు ఆఖరికి 168/6కే పరిమితమైంది. టోర్నీలో ముంబయికి ఇది నాలుగో విజయంకాగా.. కోల్‌కతాకి ఐదో ఓటమి.
Samayam Telugu ut

MI vs KKR LIVE స్కోరు బోర్డు కోసం క్లిక్ చేయండి..!



కోల్‌కతా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. రికీ సింగ్ స్థానంలో నితీశ్ రాణా మళ్లీ జట్టులోకి రాగా.. శివమ్ మావి గాయపడటంతో.. అతని స్థానంలో ప్రసీద్ కృష్ణని జట్టులోకి తీసుకుంది. ముంబయి మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

ముంబయి జట్టు: సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లావిస్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జేపీ డుమిని, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, బెన్ కటింగ్, మిచెల్ మెక్లనగాన్, మయాంక్ మార్కండే, జస్‌ప్రీత్ బుమ్రా

కోల్‌కతా జట్టు: క్రిస్‌లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభమన్ గిల్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, మిచెల్ జాన్సన్, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.