యాప్నగరం

KKR vs MI IPL Score: కోల్‌కతా ఫీల్డింగ్.. ముంబయి జట్టులో మార్పుల్లేవ్

ముంబయి ఇండియన్స్, కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌ జట్లలో ఎక్కువగా హిట్టర్లు కనిపిస్తుండగా.. అబుదాబిలో భారీ స్కోర్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో చెలరేగిన కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్ ఈ మ్యాచ్‌లో పోటాపోటీగా సిక్సర్లు బాదే అవకాశం ఉంది. కీరన్ పొలార్డ్‌కి ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్.

Samayam Telugu 23 Sep 2020, 7:10 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి. అయితే.. గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిన ముంబయి ఇండియన్స్ కాస్త ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి తాజాగా టోర్నీలో ఇది తొలి మ్యాచ్.
Samayam Telugu MI vs KKR (Photo Credit: Twitter)


ముంబయి ఇండియన్స్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైతో ఆడిన టీమ్‌ని అలానే కొనసాగించాడు. మరోవైపు కోల్‌కతా తుది జట్టులోకి విదేశీ ఆటగాళ్లుగా సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్‌ని కెప్టెన్ దినేశ్ కార్తీక్ తీసుకున్నాడు.


ముంబయి ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

కోల్‌కతా తుది జట్టు: సునీల్ నరైన్, శుభమన్ గిల్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ (కెప్టెన్, వికెట్ కీపర్), నిఖిల్ నాయక్, పాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివమ్ మావి


ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగియగా.. 25 మ్యాచ్‌ల్లో ముంబయి, కోల్‌కతా తలపడ్డాయి. ఇందులో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది. అయితే.. 2014లో యూఏఈ వేదికగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా.. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా 41 పరుగుల తేడాతో ముంబయిపై గెలుపొందడం గమనార్హం.

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Saurabh Tiwary, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, James Pattinson, Rahul Chahar, Trent Boult, Jasprit Bumrah

Kolkata Knight Riders (Playing XI): Sunil Narine, Shubman Gill, Nitish Rana, Eoin Morgan, Andre Russell, Dinesh Karthik(w/c), Nikhil Naik, Pat Cummins, Kuldeep Yadav, Sandeep Warrier, Shivam Mavi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.