యాప్నగరం

WPL 2023 లో ఈరోజే ఎలిమినేటర్ మ్యాచ్.. ఫైనల్‌ బెర్తుపై ముంబయి కన్ను

WPL 2023 Eliminator మ్యాచ్‌కి ఈరోజు డీవై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది. దాంతో ఈరోజు ఎలిమినేటర్‌లో ఆడబోతున్న ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లలో గెలిచిన టీమ్ ఆదివారం ఫైనల్‌ ఆడనుంది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 24 Mar 2023, 3:11 pm

ప్రధానాంశాలు:

  • ఈరోజు డబ్ల్యూపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్
  • ఓడిన జట్టు ఇంటికి.. గెలిచిన టీమ్ ఫైనల్‌కి
  • ఇప్పటికే ఒక ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకున్న ఢిల్లీ
  • ఆదివారం డబ్ల్యూపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mumbai Indians, UP Warriorz
ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 (WPL 2023) తుది దశకి చేరుకుంది. ఇప్పటికే సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. ఈరోజు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), యూపీ వారియర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఇప్పటికే ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి ముంబయి, యూపీ వారియర్స్ (UP Warriorz) మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుండగా.. గెలిచిన టీమ్ ఫైనల్‌కి వెళ్లనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.
లీగ్ దశలో 8 మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్ టీమ్.. ఫస్ట్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. కానీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఫైనల్ రేసులో వెనకబడిన ముంబయి టీమ్.. లాస్ట్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కి చేరింది. మరోవైపు యూపీ వారియర్స్ టీమ్ మొదటి నుంచి సీజన్‌లో పడిలేస్తూనే జర్నీని కొనసాగిస్తోంది. ముంబయి చేతిలో ఇప్పటికే లీగ్ దశలో ఒకసారి ఓడిన యూపీ వారియర్స్.. 8 మ్యాచ్‌లకిగానూ నాల్గింటిలో గెలిచి.. నాల్గింటిలో ఓడిపోయింది.

పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 6 విజయాలతో టాప్‌లో నిలవగా.. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ నిలిచాయి. ఇక కేవలం రెండేసి విజయాలతో చివరి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి. డబ్ల్యూపీఎల్‌లో ఇదే మొదటి సీజన్.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.