యాప్నగరం

ఐపీఎల్ జరపొద్దంటూ.. ఐపీఎస్ పిల్

ఈ ఏడాది ఐపీఎల్ జరగదా..? ఐపీఎల్ మ్యాచ్‌లు జరపొద్దంటూ సీనియర్ ఐపీఎస్ అధికారొకరు మద్రాస్ హైకోర్టును ఆదేశించారు.

Samayam Telugu 4 Apr 2018, 4:06 pm
ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని సీనియర్ ఐపీఎస్ అధికారి జి.సంపత్ కుమార్ మద్రాస్ హైకోర్టును కోరారు. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లను అడ్డుకునేలా బీసీసీఐ తగిన చర్యలు చేపట్టే వరకు ఐపీఎల్ నిర్వహించొద్దని ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఐపీఎల్ ఆడుతున్న 8 జట్లను ఆయన ప్రతివాదులుగా చేర్చారు.
Samayam Telugu Mumbai Indians


విచారణ అధికారిగా గతంలో ఐపీఎల్ బెట్టింగ్ భాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చానని సంపత్ తెలిపారు. కాగా బుకీల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో తమిళనాడు క్యూ బ్రాంచ్ ఎస్పీగా ఉన్న ఆయనపై నాలుగేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేశారు. కానీ అవన్నీ నిరాధారమైనవిగా తేలడంతో.. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఆయన వెలుగులోకి తెచ్చిన బుకింగ్ స్కామ్‌లో పలువురు ప్రముఖ క్రికెటర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

‘నేను ఐపీఎల్‌ను నిషేధించాలని కోరడం లేదు. కానీ బెట్టింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని కోరుతున్నాను. ఈ విషయంలో బీసీసీఐ చర్యలు తీసుకునేవరకు మ్యాచ్‌లను నిర్వహించొద్దు’ అని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.